Varudu Kaavalenu Movie Promotions: నాగశౌర్య, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'వరుడు కావలెను'. అక్టోబరు 29న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల (Varudu Kaavalenu Movie Release Date) కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం సరికొత్త రీతిలో ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఈ డిఫరెంట్​ ప్రమోషన్స్​ ప్లాన్​లో భాగంగా.. హైదరాబాద్​లో ఆదివారం జరిగిన కొన్ని పెళ్లి వేడుకల్లో నాగశౌర్య, రీతూవర్మ (Naga Shaurya Ritu Varma) తళుక్కున మెరిశారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆయా పెళ్లిళ్లకు హాజరై.. నూతన వధూవరులతో పాటు అక్కడికి వచ్చిన వారిని ఆశ్చర్యానికి గురి చేశారు. హీరోహీరోయిన్లతో ఫొటోలు దిగేందుకు వారంతా ఆసక్తి చూపారు. ఈ ప్రమోషన్స్​కు సంబంధించిన కొన్ని పిక్స్​ సోషల్​ మీడియాలో ఇప్పుడు వైరల్​గా మారాయి. 



ఈ సినిమాకు లక్ష్మీ సౌజన్య దర్శకత్వం (Varudu Kaavalenu Director) వహించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. తమన్‌ సంగీతమందించారు. మురళీ శర్మ, నదియా, వెన్నెల కిశోర్‌, ప్రవీణ్‌, హర్ష తదితరులు కీలక పాత్రలు పోషించారు.


Also Read: Pushpa 3rd Song Release Date: ప్రమోషన్స్​లో 'పుష్ప' రాజ్​ జోరు.. మూడో సాంగ్​ రిలీజ్​ ఎప్పుడంటే?


Also Read: 67th National Film Awards: 'జెర్సీ', 'మహర్షి' సినిమాలకు గానూ నేషనల్​ అవార్డ్స్​ అందుకున్న దర్శకనిర్మాతలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook.