Rangabali OTT Release date: టాలీవుడ్ యంగ్ హీరో  నాగశౌర్య నటించిన లేటెస్ట్ చిత్రం 'రంగబలి'. కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూలై 07న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప‌వ‌న్ బాసంశెట్టి ద‌ర్శ‌కుడిగా పరిచయమైన ఈ చిత్రంలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా రిలీజ్ కు ముందే టీజర్‌, ట్రైలర్‌, ప్రమోషన్స్ తో ప్రేక్షకుల్లో మంచి హైప్ క్రియేట్ చేశారు మేకర్స్. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తొలి రోజు మిక్సడ్ టాక్ వచ్చినా.. మరే పెద్ద సినిమా లేకపోవడంతో మొదటి రోజు భారీగానే కలెక్షన్లు సాధించింది రంగబలి. లవ్‌, కామెడీ, యాక్షన్‌.. ఇలా అన్ని అంశాలు పుష్కలంగా ఉండడంతో ఈ సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీసెంట్ గా చిన్న సినిమాగా వచ్చిన శ్రీవిష్ణు సామజవరగమన ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మరి నాగశౌర్య సినిమా బాక్సాఫీస్ వద్ద నిలబడుతుందో లేదా బోల్తా పడుతుందో చూడాలి.


Also Read: Samajavaragamana: దూసుకుపోతున్న ‘సామజవరగమన’... రెండో వారం కూడా శ్రీవిష్ణుదే..!


తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు సంబంధించి అప్ డేట్ వచ్చేసింది. రంగబలి డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌ సొంతం చేసుకుంది. సుమారు రూ. 7 కోట్లకు రంగబలి ఓటీటీ రైట్స్ ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి రానుంది. అంటే ఆగస్టు రెండో వారంలో ఇది నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. శ్రీ ల‌క్ష్మి వెంక‌టేశ్వ‌ర సినిమాస్ ప‌తాకంపై సుధాక‌ర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాలో యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో కమెడియన్‌ సత్యతో పాటు ముర‌ళీశ‌ర్మ‌, శ‌ర‌త్‌కుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటించారు. 


Also Read: Prabhas in Vishnu Avatar: ఇదేం ట్విస్ట్ భయ్యా.. 'శ్రీమహా విష్ణు' అవతారంలో ప్రభాస్..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook