Nagashourya Krishna vrinda vihari release date: యువ నటుడు నాగశౌర్య (Naga Shourya) నటించిన 'కృష్ణ వ్రింద విహారి' (Krishna Vrinda Vihari Movie) రిలీజ్​ డేట్​ ఫిక్స్ అయింది. ఈ చిత్రం ఏప్రిల్​ 22న థియేటర్లలో సందడి చేయనుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాకు అనీష్​ ఆర్​.కృష్ణ దర్శకత్వం వహించారు. కథానాయికగా షిర్లే సెటియా నటించింది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటిస్తూ..పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఇందులో నాగశౌర్య, షిర్లే సెటియా (Sherley Setia) స్కూటర్‌పై వెళ్తున్నారు. ఇందులో శౌర్య లుక్ సరికొత్తగా కనిపిస్తోంది. 



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నాగశౌర్య సొంత బ్యానర్ ఐరా క్రియేషన్స్‌పై ఉమా మూల్పూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. శంకర్‌ ప్రసాద్‌ మూల్పూరి సమర్పకులు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, సత్య, బ్రహ్మాజీ వంటి కమెడియన్స్ ఉన్నారు.  సీనియర్ నటి రాధిక కీలకపాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం  శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.  ఒక పాట మినహా దాదాపు చిత్రీకరణ అంతా పూర్తయినట్లు తెలుస్తోంది. ఇటీవల నాగశౌర్య నటించిన 'వరుడు కావలెను' చిత్రం పర్వాలేదనిపించినా.. 'లక్ష్య' మూవీ మాత్రం డిజాస్టర్ గా మిగిలింది. మరి ఈ చిత్రంతోనేనైనా నాగశౌర్య హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.


Also Read: Jr NTR Fans: మొదలైన ఆర్‌ఆర్‌ఆర్‌ మేనియా.. ఏకంగా థియేటర్‌నే బుక్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌! ఎక్కడో తెలుసా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి