Bheemla Nayak Trailer: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan), రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'భీమ్లా నాయక్' (Bheemla Nayak). ఫిబ్రవరి 25న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. సాగర్ కే చంద్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమాకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే అందించారు. పవన్ కల్యాణ్, రానా దగ్గుబాటి సరసన నిత్యా మేనన్, సంయుక్త మేనన్ కథానాయికలుగా నటించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ (SitharaEntertainments) పతాకంపై సూర్యదేవర నాగవంశీ సినిమాను నిర్మిస్తున్నారు.  తమన్ సంగీతాన్ని అందించారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 ఈ సినిమా ట్రైలర్ (Bheemla Nayak Trailer) ను ఇవాళ రాత్రి  8:10 గంటలకు రిలీజ్ చేస్తామని మేకర్స్ ప్రకటించారు. కానీ సమయం దాటి పోయినా ట్రైలర్ విడుదలకాకపోవడంటో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాత్రి 9 గంటలకు ట్రైలర్ వస్తుందంటూ మరో షాకిచ్చారు మేకర్స్. దీంతో నిర్మాత నాగవంశీని, నిర్మాణ సంస్థపై ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తూ..బూతులు తిడుతున్నారు. 



భీమ్లా నాయక్ ట్రైలర్ కు సంబంధించిన నెట్టింట్లో విపరీతమైన చర్చ జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ సరిగా చేయడం లేదంటూ నిర్మాతను ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్ వాయిదా వేశారు. తాజాగా ట్రైలర్ ను కూడా లేట్ చేయడంతో ఫ్యాన్స్ గుర్రుగా ఉన్నారు. 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook