Nagababu: మెగా ఫ్యామిలీ మీద చిన్న కామెంట్ చేసినా కూడా నాగబాబు సోషల్ మీడియాలో ఘాటుగానే రియాక్ట్ అవుతూ ఉంటారు. ఎప్పుడూ ముక్కు సూటిగా ఉండే నాగబాబు ఇప్పటికే తన ట్వీట్ ల వల్ల ఎన్నో వివాదాల్లో ఇరుక్కున్నారు. తాజాగా అల్లు అర్జున్ మీద చేసిన కామెంట్లు నాగబాబు విషయంలో బాగా బెడిసి కొట్టాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వివరాల్లోకి వెళితే, ఈ మధ్యనే అల్లు అర్జున్ వైఎస్ఆర్సిపిలో ఉన్న తన స్నేహితుడు శిల్పా రవి కోసం నంద్యాల వెళ్లి మరి ఎలెక్షన్ క్యాంపెయిన్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. దీంతో కోపం తెచ్చుకున్న నాగబాబు సోషల్ మీడియాలో ద్వారా ఇన్ డైరెక్టుగా బన్నీ మీద ఫైర్ అయ్యారు. 


"మాతో ఉంటూ ప్రత్యర్ధుల కోసం పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే.. మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఇది అల్లు అర్జున్ ని దృష్టిలో పెట్టుకుని చేసిన ట్వీట్ అని బన్నీ ఫాన్స్ ట్విట్టర్ లో నాగబాబు మీద భారీగా ఫైర్ అయ్యారు. 


దీంతో నాగబాబు సడన్ గా తన ట్విట్టర్ అకౌంట్ ని డీ యాక్టివేట్ చేసేశారు. బన్నీ ఫ్యాన్స్ వల్లే నాగబాబు ట్విట్టర్ నుండి ఎగ్జిట్ అయ్యారు అంటూ చాలామంది కామెంట్లు కూడా చేశారు. ఇదంతా జరిగి వారం కూడా కాలేదు కానీ మళ్ళీ ట్విట్టర్ లోకి రీ ఎంట్రీ ఇచ్చేసారు మెగా బ్రదర్.


ఎంట్రీ ఇవ్వడమే నాగబాబు చేసిన మొదటి ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. "నేను నా ట్వీట్ ని డిలీట్ చేసేసాను" అంటూ నాగబాబు ట్వీట్ చేశారు. ఏదేమైనా ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఈ వివాదానికి ముగింపు రాదేమోనని కొందరు కామెంట్లు చేస్తున్నారు.


 



 


Also Read: Air India Flight: ట్రక్‌ను ఢీకొన్న ఎయిరిండియా విమానం.. ప్రాణభయంతో ఉలిక్కిపడిన ప్రయాణికులు



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter