Nagababu-Garikapati-Chiranjeevi : చిరంజీవి స్టేజ్ మీద ఎంత హుందాగా ప్రవర్తిస్తుంటారు.. ఎంత హుందాగా మాట్లాడుతుంటారో అందరికీ తెలిసిందే. ఒక్క మాట కూడా తప్పుగా మాట్లాడరు. ఒక్కరినీ కూడా వేలెత్తి చూపించారు. తనను ఎంత మంది ఎన్ని అన్నా కూడా చిరునవ్వుతోనే సమాధానమిస్తారు. ఇక నిన్నటి అలయ్ బలయ్ కార్యక్రమంలోనూ ఇదే చెప్పారు. ఎంత మంది ఎన్ని అన్నా కూడా.. నిజాలు నిలకడగా తెలుస్తాయి.. మనం సంయమనం పాటించాలి.. మాటతో గెలవలేం గానీ ప్రేమతో గెలవొచ్చు.. అంటూ ఇలా తన మనస్తత్వం గురించి మరోసారి చెప్పాడు. అదే ఈవెంట్‌లో ఆ మాటలు నిరూపితమయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చిరంజీవి కనిపిస్తే.. అందరూ సెల్ఫీలు అడగుతారు. అక్కడంతా సందడి వాతావరణం ఉంటుంది. అది సహజమే. అది అర్థం చేసుకుని గరికపాటి వంటి వారు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాల్సింది. తన ప్రవచనాలకు అది ఇబ్బందిగా ఉందంటూ.. చిరంజీవిని ఫోటో సెషన్ ఆపాలని కోరారు. విజ్ఞప్తి చేశారు. అయితే అక్కడ చిరంజీవి మీద మాత్రం తన కోపాన్ని గాన్నీ ద్వేషాన్ని గాన్నీ ప్రదర్శించలేదు గరికపాటి. ఆ సెల్ఫీల సెషన్ ఆపి ఇక్కడ కూర్చోండని కోరాడు. లేదంటే తన ప్రవచనాలు ఆపేసి వెళ్లిపోతానని అన్నారు.


దీంతో చిరంజీవి వెంటనే అది ఆపేశారు. గరికపాటి పక్కన కూర్చున్నారు. ఆ తరువాత చిరంజీవి మాట్లాడుతూ.. ఎంతో హుందాగా ప్రవర్తించారు. గరికపాటి అంటే తనకు అభిమానమని, తన ప్రవచనాలు ఎంతో స్పూర్తినిచ్చేలా ఉంటాయని ఇలా ఎంతో గొప్పగా చెప్పి ప్రశంసించాడు. తన మీద సీరియస్ అయిన వారిని కూడా అక్కడే స్టేజ్ మీద పొగడటం చిరంజీవి హుందాతనం. అయితే ఈ వివాదంలోకి నాగబాబు దూరడం, గరికపాటి మీద పరోక్షంగా సెటైర్లు వేయడంతో వివాదం యూటర్న్ తిరిగింది.


 



అక్కడ చిరంజీవే గరికపాటిని క్షమించేశాడు. ఒక్క మాట కూడా అనలేదు. అది చిరంజీవి గొప్పదనం. కానీ చిరు సోదరుడు నాగబాబు, కొంత మంది మెగా ఫ్యాన్స్ మాత్రం గరికపాటి మీద కౌంటర్లు వేస్తూ వివాదాన్ని ఇంకా సాగదీస్తున్నారు. ఇందులో చిరు గొప్పదనం కంటే.. గరికపాటి అన్న మాటల్నే ఎక్కువగా హైలెట్ చేస్తున్నారు. ఇక బ్రహ్మాజీ సైతం చిరు గొప్పదనాన్ని కొనియాడాడు. అన్నయ్యని చూసి నేర్చుకోవలసింది చాలా ఉంది ..చిరంజీవి సుఖీభవ అని పొగిడేశాడు.


 



ఇక నిర్మాత, మెగా అభిమాని అయిన ఎస్‌కేఎన్ గరికపాటి మీద కౌంటర్లు వేశాడు. వయసు వచ్చిన ప్రతి వాళ్ళకి జ్ఞాన దంతం రావాలి అని రూల్ లేదు కదా అంటూ సెటైర్లు వేశాడు. గరికపాటిని చిరంజీవే స్వయంగా క్షమించేసి.. ప్రేమతో గెలిచేశారు. గరికపాటి మీద ప్రశంసలు కురిపించారు. కానీ కొంత మంది మాత్రం అగ్నికి ఆజ్యం పోసినట్టుగా వివాదాన్ని పెద్దది చేస్తున్నారు. దీన్ని మరీ ఇంత రాద్దాంతం చేయాల్సిన అవసరం లేదు.. అక్కడ చిరంజీవి గొప్పదనమే అందరికీ అర్థమవుతోందని అంటున్నారు అభిమానులు.


Also Read : Bithiri Sathi Car : రేంజ్ రోవర్ కొన్న సత్తి.. ఆడి కొనేసిన హర్.. రేట్లు ఎంతంటే?


Also Read : సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. సినిమా రిలీజ్ రోజే కన్నుమూసిన సీనియర్ యాక్టర్


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook