Nagachaitanya Refused Siva title to Custody Movie: థాంక్యూ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ డిజాస్టర్ అందుకున్న నాగచైతన్య. ఇప్పుడు కస్టడీ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రంగం సిద్ధమవుతోంది. మే 12వ తేదీన ఈ సినిమాతో నాగచైతన్య ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నాడు. నాగచైతన్య హీరోగా కృతి శెట్టి హీరోయిన్గా ఈ సినిమా రూపొందింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తమిళ దర్శకుడు వెంకట ప్రభు ఈ సినిమాని తమిళ, తెలుగు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. అదే విధంగా ఏకకాలంలో విడుదల కూడా చేస్తున్నారు. మరో పక్క ఈ సినిమాని హిందీలో కూడా డబ్బింగ్ చేయించి రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. ఆ సంగతి పక్కన పెడితే ఈ సినిమాని శ్రీ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్ మీద శ్రీ శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.


Also Read: Manobala Greatness: రామోజీ ఫిలింసిటీకి వచ్చినప్పుడల్లా మనోబాల చేసే పని తెలిస్తే షాకవ్వక తప్పదు!


ఈ సినిమాలో నాగచైతన్య ఒక పోలీస్ కానిస్టేబుల్ పాత్రలో కనిపిస్తున్నాడు. అయితే ఈ సినిమా టైటిల్ గురించి ఒక ఆసక్తికరమైన చర్చ జరిగిందనే విషయాన్ని దర్శకుడు వెంకట్ ప్రభు తాజాగా జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సినిమా అంతా శివ అనే ఒక కానిస్టేబుల్ లైఫ్ జర్నీ అని అందుకే ఈ సినిమాకి ముందు శివ అనే టైటిల్ పెట్టాలని అనుకున్నామని వెంకట్ ప్రభువు చెప్పుకొచ్చారు. వెంటనే నాగచైతన్య వద్దని చెప్పాడని శివ అనేది ఒక కల్ట్ ఫిలిం, అలాంటి సినిమా పేరు మన సినిమాకి పెడితే నన్ను జనం చంపేస్తారు అన్నాడని అప్పుడే మరో టైటిల్ కోసం వెతికి చివరిగా కస్టడీ అనే టైటిల్ ఫిక్స్ చేశామని చెప్పుకొచ్చారు.


ఇక శివ అనే సినిమా నాగార్జునకు పర్ఫెక్ట్ లాంచింగ్ అని చెబుతారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో 90 లో వచ్చిన శివ సినిమా ఇప్పటికీ ఒక ట్రెండ్ సెట్టింగ్ మూవీ అని చెప్పుకుంటూ ఉంటారు. అలాంటి సినిమా టైటిల్ ని నాగచైతన్య వద్దనుకోవడం బెటర్ అని అక్కినేని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. ఇక కస్టడీ సినిమాతో నాగచైతన్య ఎంతవరకు హిట్ అందుకుంటాడు అనేది చూడాల్సి ఉంది.


Also Read: Tamannaah Unbuttoned Pic: చొక్కా విప్పేసి తమన్నా హాట్ ట్రీట్.. క్లీవేజ్ షోతో రచ్చోభ్యహ!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook