నాగార్జున బర్త్ డే స్పెషల్ : దేవదాస్ మోషన్ పోస్టర్
దేవదాస్ మోషన్ పోస్టర్లో నాగార్జున, నాని
నాగార్జున, నాని కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ దేవదాస్ సినిమా మోషన్ పోస్టర్ విడుదలైంది. ఆగస్టు 29 నాగ్ పుట్టిన రోజు కావడంతో అభిమానులకు అతడి బర్త్ డే కానుకగా ఒక రోజు ముందే నిర్మాతలు ఈ మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై అశ్వనీదత్ నిర్మిస్తు్న్న ఈ సినిమాను శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్నారు. కామెడీ యాక్షన్ నేపథ్యంతో తెరకెక్కుతున్న దేవదాస్ చిత్రంలో గీత గోవిందం ఫేమ్ రష్మిక మందన్న, ఆకాంక్ష హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. సెప్టెంబర్ 27న రిలీజ్ కానున్న ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ కంపోజర్ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.