Naa Saami Ranga: ‘నాతో పని లేదు అనుకున్నారేమో’…నా సామి రంగా దర్శకుడి పై నాగార్జున కామెంట్స్..
Nagarjuna: ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలలో నా సామి రంగా మంచి విజయం సాధించింది. హనుమాన్ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించగా ఆ చిత్రం తరువాత పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న చిత్రంగా ఈ నాగార్జున సినిమా మిగిలింది…
Vijay Binni: ఈ సంవత్సరం సంక్రాంతికి నాలుగు సినిమాలు విడుదల కాగా ఆ నాలుగు సినిమాలలో ప్రశాంత్ వర్మ హనుమాన్ తరువాత కొంచెం పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న చిత్రం నాగార్జున నా సామి రంగా. పక్కా విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈ చిత్రం ఎన్నో రోజుల నుంచి నాగార్జున ఎదురు చూస్తున్న సూపర్ సక్సెస్ అందించింది. ఈ మధ్యనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కూడా పూర్తి చేసుకుంది.
నా సామి రంగ సినిమా ని కేవలం 70 రోజుల్లో పూర్తి చేశారు కొత్త దర్శకుడు విజయ్ బిన్నీ. ఎన్నో సినిమాలకు కొరియోగ్రాఫర్ గా చేసిన విజయ్ దర్శకత్వం వహించింది మాత్రం ఈ సినిమాకే. కాగా మొదటి చిత్రంతోనే మంచి విజయం సాధించగా డ్యాన్సర్స్ యూనియన్ విజయ్ ని ఘనంగా సత్కరించారు. ఈ ఈవెంట్ కి నాగార్జున, అల్లరి నరేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ నేపథ్యంలో నాగార్జున ఈ దర్శకుడి గురించి చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆకట్టుకున్నాయి. ‘విజయ్ నిన్న సాయంత్రం నాకు ఫోన్ చేసి ఈవెంట్ గురించి చెప్పాడు. నేను లేకుండా ఈ కార్యక్రమాన్ని చేద్దామని అనుకున్నాడేమో.. సినిమా అయిపోయింది కదా? నాతో ఇక పని లేదని అనుకున్నాడు’.. అని నాగార్జున తమాషా వ్యాఖ్యలు చేశారు. విజయ్ ఎంట్రీ ఇస్తే మీరంతా హుషారుగా అరిచారు.. అది చూస్తే మా సినిమా ఎంత పెద్ద విజయం సాధించింది అన్న విషయం నాకు అర్థమైంది. మా సినిమా హిట్ అని ఇప్పుడు నమ్మకం ఏర్పడింది అని అన్నాడు.
‘విజయ్ ఈ సినిమాను కళ్లు మూసి తెరిచేలోగా పూర్తి చేసేసాడు. కొరియోగ్రాఫర్ కావడం వల్ల ఈ సినిమా అంతా ఒక పాటలా తీసేశాడు.. మా అందరినీ పువ్వుల్లో పెట్టుకుని చేశాడు.. ఈ సినిమా రెండు గంటల ముప్పై నిమిషాల నిడివి మాత్రమే వచ్చిందని.. చివరకు రెండు గంటల 23 నిమిషాలు ఉంచామని, మా ఎడిటర్‌కు తక్కువ పని కల్పించాడు’ అని అన్నాడు. ఎంత కావాలో, ఎక్కడికి కావాలో అంతే తీసుకున్నాడంటూ.. తన కెరీర్‌లో అతి కొద్ది ఫేవరెట్ దర్శకులలో విజయ్ ఒకడని ప్రశంసించాడు.
అయితే చాలామందికి ఇలా తీయడం రాదని..ఎలాంటి వేస్టేజ్ లేకుండా ఎక్కడికి ఎంత కావాలో అంతే తీస్తారు విజయ్ అని చెప్పుకొచ్చాడు.’ కొంత మంది మేకర్లు మాత్రం మూడు గంటల సినిమాకు ఆరు గంటలు తీస్తారు. అలా చేయడం వల్ల శ్రమ,నిర్మాతకు ఆర్థిక భారం ఇలా అన్నీ పెరుగుతాయి. కానీ విజయ్ బిన్నీ మాత్రం చాలా పకడ్బంధీగా సినిమాను పూర్తి చేశారు,’ అని తెలియజేశారు నాగార్జున.
Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?
Also Read: BRS Party MLAS Meet Revanth: బీఆర్‌ఎస్ పార్టీలో కలకలం.. సీఎం రేవంత్‌ను కలిసిన నలుగురు ఎమ్మెల్యేలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook