Nagarjuna - Naa Saami Ranga: 2 వారాలు పూర్తి చేసుకున్న నాగార్జున `నా సామిరంగ`.. మొత్తం వసూళ్లు ఎంతంటే..?
Nagarjuna - Naa Saami Ranga: నాగార్జున అక్కినేని హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `నా సామిరంగ`. ఈ మూవీ సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ మూవీ పాజిటివ్ టాక్‌తో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. నిన్నటితో రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ ఓవరాల్‌గా ఎంత రాబట్టిందంటే..
Nagarjuna - Naa Saami Ranga:నాగార్జనకు గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేదు. బంగార్రాజు తర్వాత హిట్ కోసం ముఖం వాచిపోయాడు. బంగార్రాజు తర్వాత చేసిన 'ది ఘోస్ట్' సినిమా పెద్దగా అలరించలేకపోయింది. దీంతో గ్యాప్ తీసుకొని మరి 'నా సామిరంగ' అంటూ పక్కా విలేజ్ మాస్ డ్రామాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ నాగార్జున నమ్మకాన్ని నిలబెట్టింది. ఈ సినిమాతో కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని డైరెక్టర్‌గా మారాడు. ఈ మూవీ మలయాళంలో హిట్టైన 'పొరింజు మరియం జోస్'రీమేక్‌గా తెరకెక్కింది. ఈ సినిమాను నాగార్జున ఇమేజ్‌తో పాటు తెలుగు నేటివిటికి తగ్గట్టు తెరకెక్కించి మంచి హిట్‌గా నిలిచింది. ఈ మూవీలో నాగార్జున సరసన ఆషికా రంగనాథ్ నటించింది.
అంతేకాదు ఇతర ముఖ్యపాత్రల్లో అల్లరి నరేష్, రాజ్ తరుణ్‌లు నటించారు. ఈ మూవీతో షబీర్ కల్లకరల్ విలన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ మూవీ 1980 బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కించారు. రా విలేజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీ సంక్రాంతి నేపథ్యంలో తెరకెక్కింది. అదే ఈ సినిమా ప్లస్‌గా నిలిచింది. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలై నిన్నటితో 2 వారాలు పూర్తి చేసుకుంది.
ఈ మూవీ తెలుగులో రూ. 18 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. రూ. 19 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది. ఓవరాల్‌గా ఈ మూవీ ఇప్పటి వరకు రూ. 21.29 కోట్ల షేర్ (రూ. 36.55 కోట్ల గ్రాస్) వసూళ్లను రాబట్టింది. ఓవరాల్‌గా 2024లో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని రెండో హిట్‌గా నిలిచింది. ఈ మూవీ ఇప్పటి వరకు థియేట్రికల్‌గా రూ. 2.30 కోట్ల లాభాలను తీసుకొచ్చింది. ఈ మూవీ శాటిలైట్, డిజిటల్ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. ఈ మూవీ నాన్ థియేట్రికల్‌గా రూ. 40 కోట్ల వరకు అమ్ముడు పోయాయి. మొత్తంగా ఈ మూవీ థియేట్రికల్ రన్ దాదాపు ముగిసినట్టే చెప్పాలి.
ఇదీ చదవండి: మీపేరు ఈ 2 అక్షరాలతో మొదలవుతుందా? అయితే, మీలవ్ బ్రేకప్..
ఇదీ చదవండి: ఇంట్లో ఈ దిక్కున అద్దం పెడితే అదృష్టం.. ఆ ఇంట్లోవారికి ప్రతి పనిలో విజయం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook