The Ghost Twitter Review: కింగ్ హిట్టు కొట్టాడా? సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులు ఏమంటున్నారు?
The Ghost Movie Twitter Review: నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు మన ట్విట్టర్ రివ్యూలో చూద్దాం.
The Ghost Movie Twitter Review: వైల్డ్ డాగ్ మూవీతో హిట్ అందుకున్న నాగార్జున తర్వాత బంగార్రాజు సినిమాతో కూడా హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం ఆయన ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో ది ఘోస్ట్ అనే సినిమా చేశారు. ఆ సినిమా ఆగస్టు 5వ తేదీన దసరా సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వచ్చేసింది. ఇక ఈ సినిమా ఆసక్తికరంగా తమిళంలో కూడా విడుదల చేస్తున్నారు. హిందీలో కాస్త ఆలస్యంగా విడుదల చేసే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. నాగార్జున హీరోగా నటించిన ఈ సినిమాలో సోనాల్ చౌహాన్ హీరోయిన్గా నటించగా నాగార్జున సోదరిగా గుల్ పనాగ్, మేనకోడలిగా అనికా సురేంద్రన్ నటించారు.
ఏషియన్ సునీల్ నారంగ్, పుష్కూర్ రామ్మోహన్రావు, శరత్ మారార్ సంయుక్తంగా నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన పలుషోలు విదేశాల్లో ప్రదర్శితమయ్యాయి. మరి ఈ సినిమా ఎలా ఉంది అనేది అక్కడ ప్రేక్షకులు తమ అభిప్రాయాలను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. ఇక ఈ సినిమా ప్రీమియర్స్ అలాగే స్పెషల్స్ చూసిన ఆడియన్స్ ఏమని అంటున్నారు అనే విషయం మీద ఒక లుక్కు వేస్తే, నాగార్జున హీరోగా నటించిన ది ఘోస్ట్ సినిమా మీద ప్రస్తుతానికి అయితే మిశ్రమ స్పందన లభిస్తోంది. సినిమాలో కొన్ని ఎలిమెంట్స్ బాగా ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తున్నాయని అయితే మరికొన్ని ఎలిమెంట్స్ మాత్రం నిరాశ పరుస్తున్నాయని సినిమా చూసిన వాళ్లు కామెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా సినిమా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వదని ట్విట్టర్ జనాలు గుసగుసలాడుతున్నారు.
ఫస్ట్ ఆఫ్ లో హీరోయిన్ సోనాల్ చౌహాన్ కి సంబంధించిన ఒక్క సీను కూడా సరిగా కుదరలేదని సాంగ్స్ కూడా అంతంత మాత్రమే అనిపింఛాయని వారు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రీ ఇంటర్వెల్ 20 నిమిషాలు మాత్రం సూపర్ గా ఉంటుందని ఆ ఎలివేషన్ బాగా కుదిరిందని కామెంట్ చేస్తున్నారు. ఈ సినిమా ట్విస్టులు కూడా ఆడియన్స్ కి తెలియకుండానే వారిని సినిమాలో లీనమయ్యే విధంగా కూర్చోబెడతాయని అంటున్నారు. అయితే ఇది ఒక రకం స్పందన అయితే మరో రకం ఆడియన్స్ మాత్రం సినిమా అసలు ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిందని కామెంట్ చేస్తున్నారు స. నిమాలో నటీనటులు ఎమోషన్స్ పండించడంలో ఎందుకో విఫలమయ్యారని కావాలని ఎమోషన్స్ తెచ్చి పెట్టుకుని నటించినట్లు ఈజీగా అర్థమయిపోతుందని అంటున్నారు.
మరి ముఖ్యంగా ఏడుపు కూడా బలవంతంగా డైరెక్టర్ తిడతాడని ఇంకా ఏదో భయంతో ఏడ్చినట్లు అనిపిస్తుందని అంటున్నారు. ఇక ఈ సినిమా యాక్షన్ ఎపిసోడ్స్ కూడా బాగా కుదిరాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అలాగే ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగా కుదిరిందని అంటున్నారు. కానీ విజ్యువల్స్ బాగా రిచ్ గా ఉండేలాగా ప్లాన్ చేశారు కానీ ఎమోషనల్ సీన్స్ లో బలవంతపు నటనతో వాటన్నింటినీ దూరం చేసుకున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమా బాగుంది అని కొందరు అంటుంటే కొంతమంది మాత్రం డిజాస్టర్ ఖాయం అంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కొంతమంది మాత్రం దసరాకి ఒకసారి చూడగలిగే సినిమా నాగార్జున తీసుకువచ్చారు అంటూ కామెంట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుంటాను అనుకున్న నాగార్జున ఆశలను ది ఘోస్ట్ సినిమా ఒకరకంగా వమ్ము చేసినట్లుగానే ట్విట్టర్ ప్రేక్షకుల అంచనాలను బట్టి అర్థమవుతుంది. ఎందుకంటే మిశ్రమ స్పందన వచ్చింది అంటే సినిమా మీద ఖచ్చితంగా నెగిటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చూడాలి ఫైనల్ గా సినిమా చూసిన తర్వాత ప్రేక్షకులు ఎలాంటి అనుభూతికి లోనవ్వబోతున్నారు అనేది.
Also Read: Allu Arjun - Ram Charan : రా రా.. రా పక్కన కూర్చోరా!.. వీడియో వైరల్
Also Read: Godfather Twitter Review : గాడ్ ఫాదర్ ట్విటర్ట్ రివ్యూ.. అదే పెద్ద మైనస్ అంటున్నారే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook