Nagarjuna Upcoming Movie: ఈమధ్య కాలంలో వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న సీనియర్ హీరోలలో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. ఈ మధ్యనే నా సామి రంగా సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి వచ్చారు నాగార్జున. సినిమా యావరేజ్ గా ఉన్నప్పటికీ, సంక్రాంతి సమయంలో విడుదల అనడంతో మంచి కలెక్షన్లు అందుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఇప్పుడు నాగార్జున వరుసగా సినిమాలు సైన్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కలిసి కుబేర అనే సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు నాగార్జున. ఇది ఒక మల్టీస్టారర్ సినిమా. ఈ సినిమా లో తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో కలిసి  నటిస్తున్నారు నాగ్. 


దీని తర్వాత తన కెరియర్ లో 100 వ సినిమా కోసం ఒక తమిళ్ దర్శకుడు నవీన్‌ తో చేతులు కలుపుతున్నారు కింగ్ నాగార్జున సైన్ చేసినట్టు సమాచారం. నాగ్‌ తో నవీన్ సినిమా గురించిన చర్చ చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. తమిళంలో మూడర్ కూడం అనే సినిమాతో డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు నవీన్. చిన్న సినిమానే అయినప్పటికీ, ఈ సినిమా తో నవీన్ మంచి పేరు మాత్రం సంపాదించాడు. ఆ తర్వాత 2021 లో అరుణ్ విజయ్, విజయ్ ఆంటోనీ హీరోలు గా నవీన్ అగ్ని సిరగుగాల్ అని సినిమా కూడా చేశారు. 


గత ఏడాది నవీన్ నాగార్జున ను ఒక మంచి కథ తో సంప్రదించారట. అప్పట్నుంచి కథా చర్చలు చాలా కాలం పాటు జరిగి ఎట్టకేలకు సినిమా కథ ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కనుంది. పర భాషలకు చెందిన నటీనటులు కూడా ఈ సినిమాలో భాగం కాబోతున్నారట. కోలీవుడ్ లో అగ్ర నిర్మాతల్లో ఒకరైన జ్ఞానవేల్ రాజా ఈ సినిమాని భారీ బడ్జెట్ తో ప్రొడ్యూస్ చేయబోతున్నారు. మొత్తానికి తెలుగు దర్శకులు తనకి సరైన విజయాలు ఇవ్వలేకపోతున్నారు అనుకున్నారో ఏమో కానీ నాగార్జున తన మైలురాయి చిత్రంని తమిళ డైరెక్టర్ చేతిలో పెట్టాలనుకోవడం విశేషం.


అయితే నిజానికి నాగార్జున కెరియర్ లో 100వ సినిమా కోసం తెలుగువాడే అయిన తమిళ దర్శకుడు మోహన్ రాజాతో చేతులు కలపాలని చూశాడు నాగ్. కానీ ఆ కాంబో మాత్రం కుదరలేదు. ఇప్పుడు ఆ స్థానం లోకి నవీన్ వచ్చాడు. ఈ ఏడాది మధ్యలో సినిమా సెట్స్ మీదికి వెళ్లే అవకాశముంది. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో సినిమా విడుదల కావచ్చు.


Also read: AP Elections 2024: ఏపీలో బీజేపీ అభ్యర్ధులు ఎవరు ఎక్కడ్నించి పోటీ



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook