Naa Saami Ranga Trailer: నాగార్జున నరుకుడు మామూలుగా లేదు.. `నా సామి రంగ` ట్రైలర్ అదిరింది..

Naa Saami Ranga Trailer: అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం `నా సామి రంగ`(Naa Saami Ranga). విజయ్ బిన్ని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ సంక్రాంతికి రానుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్.
Naa Saami Ranga Trailer Out: యువ సామ్రాట్ నాగార్జున నయా మూవీ 'నా సామి రంగ'(Naa Saami Ranga). విజయ్ బిన్ని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ జోరు పెంచింది నాగ్ టీం. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను లాంఛ్ చేశారు మేకర్స్. ట్రైలర్ మెుత్తం విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంది. ''కిష్టయ్యని వెయ్యాలంటే సావుకు ఎదురెళ్లాలి..'' అనే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ట్రైలర్ మెుత్తం ఫన్ అండ్ యాక్షన్ తో సాగింది. నాగార్జున తనలోని మాస్ కోణాన్ని మరోసారి చూపించాడు.
ఇప్పటికే ఈమూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్, సాంగ్స్ ఆడియెన్స్ లో విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. ఆషికా రంగనాథ్ వరలక్ష్మీ పాత్రలో, అల్లరి నరేశ్ అంజిగాడు పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే అంజిగాడు గ్లింప్స్ నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. ఇందులో నరేష్ కు జోడిగా మిర్నా మీనన్ నటిస్తోంది. ఈ మూవీలో రావు రమేష్, నాజర్ తదితరుల కీ రోల్స్ చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ డిస్నీ+హాట్ స్టార్ దక్కించుకుంది. పవన్ కుమార్ సమర్పణలో వస్తోన్న ఈ చిత్రానికి ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందిస్తున్నాడు. ఆస్కార్స్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. శ్రీనివాసా చిట్టూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు.
Also Read: Naa Saami Ranga: అంచనాలు తారుమారు చేసిన నాగార్జున.. ఈసారి హిట్ దక్కేనా
Also Read:Guntur Kaaram: గుంటూరుకారం బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్... ఆ ఒక్క సెంటిమెంట్ వల్ల!!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook