NBK 108: బాలయ్య కోసం బాలీవుడ్ విలన్, హీరోయిన్.. డిసెంబర్ 8న గ్రాండ్ ఓపెనింగ్!
Balakrishna 108 Launch: నందమూరి బాలకృష్ణ 108వ సినిమా లాంచ్ డేట్ ఫిక్స్ అయింది, ఈ సినిమా లాంచ్ గ్రాండ్ గా ప్లాన్ చేస్తోంది సినిమా యూనిట్. ఆ వివరాలు
Nandamuri Balakrishna 108 to be launched on December 8th: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని డైరెక్షన్ లో ఒక సినిమా చేస్తున్నాడు. 107వ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు వీర సింహారెడ్డి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ స్టార్ దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఆయన భార్య పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
వరలక్ష్మీ శరత్ కుమార్ బాలకృష్ణ సోదరి పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా పూర్తయిన వెంటనే బాలకృష్ణ తన 108వ సినిమా ప్లాన్ చేశారు ఇప్పటికే అనిల్ రావిపూడి చెప్పిన కథ ఫైనల్ చేయగా ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా ఘనంగా జరగబోతున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన ప్రారంభోత్సవం డిసెంబర్ 8వ తేదీన జరగబోతుందని ఇప్పటికే ముహూర్తం చూసి బాలకృష్ణ ఫైనల్ చేశారని అంటున్నారు.
ఇక ఈ సినిమాలో శ్రీ లీల ఒక కీలక పాత్రలో నటిస్తుందని ఆమె బాలకృష్ణ కుమార్తె పాత్రలో నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని ప్రచారం జరుగుతోంది. ఇక ఈ సినిమా కోసం బాలీవుడ్ నుంచి అర్జున్ రాంపల్లి దింపుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే అర్జున్ రాంపాల్, హరిహర వీరమల్లు సినిమాలో ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొంతవరకు టాలీవుడ్ కు ఆయన అలవాటు పడ్డాడు అనుకుంటున్న తరుణంలో బాలకృష్ణ సినిమాలో కూడా ఆయనకు అవకాశం రావడంతో ఆయన వెంటనే ఓకే చేసినట్లు తెలుస్తోంది.
ఇక హీరోయిన్ గా సోనాక్షి సిన్హాని ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తం మీద బాలకృష్ణ అభిమానులకు మాత్రం వరుస గుడ్ న్యూస్ లు వస్తున్నాయని చెప్పవచ్చు.
ఒక పక్క అన్ స్టాపబుల్ షో తో సందడి చేస్తున్న ఆయన అడపాదడపా ఇతర హీరోల ఈవెంట్స్ లో కూడా కనిపిస్తున్నారు. ఇక తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న దాస్ కా ధమ్ కీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి హాజరవ్వడమే కాక తాను డైరెక్టర్ గా మారుతున్నానని ఆదిత్య త్రిబుల్ నైన్ మాక్స్ అనే సినిమాతో డైరెక్షన్ చేయబోతున్నట్టు కూడా ఆయన ప్రకటించారు.
Also Read: Tabassum Govil Death: సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. మరణించిన వార్త బయట పెట్టొద్దని మాట తీసుకున్న నటి?
Also Read: Allu Aravind Supports Dil Raju: దిల్ రాజుకు అల్లు అరవింద్ సపోర్ట్.. అసలు అది జరగదంటూ కామెంట్స్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook