Nandamuri Balakrishna AVoids Jr NTR నందమూరి బాలకృష్ణ ముందు నుంచి కూడా ఎన్టీఆర్ విషయంలో కాస్త దూరాన్ని మెయింటైన్ చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. అసలు నందమూరి హీరోలంతా కూడా మొదట్లో ఎన్టీఆర్‌ను దూరం పెట్టేశారు. కానీ ఎన్టీఆర్ క్రేజ్, ఫాలోయింగ్, స్టార్డం చూసి మళ్లీ నందమూరి ఫ్యామిలీ దగ్గరకు తీసుకుంది. తారకరత్న, కళ్యాణ్‌ రామ్ ఇలా ఎవ్వరూ కూడా ఎన్టీఆర్ క్రేజ్‌కు దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. బాలయ్య డౌన్ ఫాల్‌లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ క్రేజ్ ఎవరెస్ట్ స్థాయిలో ఉండేది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బాలయ్య మాత్రం ఇప్పటికీ ఎన్టీఆర్‌ను దూరంగా ఉంచుతున్నట్టుగా కనిపిస్తోంది. బాలయ్య ఎన్టీఆర్ కలిసి ఒకే వేదికపై కనిపించడం చాలా అరుదు. అరవింద సమేత ఈవెంట్,ఎన్టీఆర్ కథానాయకుడు ఈవెంట్ సమయంలో బాలయ్య, ఎన్టీఆర్ ఒకే స్టేజ్ మీద కనిపించారు. ఎన్టీఆర్ బయోపిక్‌లోనూ జూ.ఎన్టీఆర్‌కు బాలయ్య చాన్స్ ఇవ్వలేదు. ఇలా ప్రతీ సందర్భంలోనూ ఎన్టీఆర్ మీద అయిష్టాన్ని బాలయ్య పరోక్షంగానో, ప్రత్యక్షంగానో ప్రదర్శిస్తూనే ఉంటాడు.


ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ షోలోనూ ఎన్టీఆర్‌కు ఆహ్వానం ఇవ్వకుండా బాలయ్య తన కోపాన్ని, అయిష్టాన్ని ప్రదర్శించినట్టు అనిపిస్తోంది. బాలయ్యకు చిరంజీవి, ఎన్టీఆర్ అంటే అంతగా ఇష్టం ఉన్నట్టుగా కనిపించదు. ఆహా అల్లు అరవింద్ గుప్పిట్లో ఉన్నా కూడా అన్ స్టాపబుల్ షో అనేది మాత్రం బాలయ్య చెప్పినట్టుగానే నడుస్తుంది.


బాలయ్యకు ఇష్టమున్న హీరోలు, సెలెబ్రిటీలో అందులోకి వస్తుంటారు. బాలయ్య యస్ చెబితేనే గెస్టుల లిస్ట్ రెడీ అవుతుంది. రెండో సీజన్‌లో చిరంజీవి కనిపిస్తాడని, ఎన్టీఆర్ కూడా వస్తాడని గాసిప్స్ వచ్చాయి. కానీ ఇప్పుడు ఈ రెండో సీజన్ ముగిసేందుకు వస్తోంది. ఇప్పటికే ఈ షోలో బన్నీ, మహేష్‌ బాబు, ప్రభాస్ వంటి వారు వచ్చారు. రామ్ చరణ్ సైతం వీడియో కాల్ రూపంలో వచ్చినట్టు. త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్‌ కూడా వస్తారని తెలుస్తోంది.


కానీ బాలయ్య మాత్రం చిరంజీవి, ఎన్టీఆర్‌లను పిలవడం ఇష్టపడుతున్నట్టుగా కనిపించడం లేదు. మరోసారి ఇలా తమ మధ్య ఉన్న కోల్డ్ వార్‌ను బాలయ్య బయటపెట్టేసుకున్నట్టు అవుతోంది. మరి మున్ముందు అయినా బాలయ్య వీరిని తన షోకు గెస్టులుగా పిలుస్తాడా? లేదా? అన్నది చూడాలి


Also Read : Pushpa The Rise Glimpse : వెనుకడుగు వేసిన పుష్ప టీం.. అవతార్‌ 2తో పాటు థియేటర్లో రాకపోవడానికి కారణం ఇదేనట


Also Read : chiranjeevi-Radhika : చిరు రాధిక కాంబోలో సినిమా.. నాడు ఇచ్చిన మాటకోసమేనా?


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook