Nandamuri Balakrishna Flirts with a heroine in Unstoppable With NBK 2 నందమూరి బాలకృష్ణ పేరుకు తగ్గట్టుగానే చాలా చిలిపి వ్యక్తి అని ఆయన దగ్గర వారు చెబుతూ ఉంటారు. ఆయనది చిన్నపిల్లాడి మనస్తత్వం అని ఇప్పటికీ బోలా శంకరుడిలాగా మనసులో ఏది ఉంటే అది బయటకు, మాట్లాడేస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే గతంలో నందమూరి బాలకృష్ణ అమ్మాయిల విషయంలో చేసిన కొన్ని కామెంట్లు వివాదాస్పదం అయ్యాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నారా రోహిత్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన నందమూరి బాలకృష్ణ ఆ వేడుకకు విచ్చేసిన తన అభిమానులను ఉద్దేశించి కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. కుర్రాళ్ళు అంటే ఎలా ఉండాలి అమ్మాయి కనబడితే విజిలైనా వేయాలి కడుపైనా చేయాలి, అంతలా యాక్టివ్ గా ఉండాలి అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడితే అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. ఆ తర్వాత కూడా ఆయన ఒక సందర్భంలో పూజా హెగ్డే అందాన్ని పొగుడుతూ హిందీలో ఒక గజల్ పాడడం కూడా అప్పట్లో ఆసక్తికరంగా మారింది.


ఇక ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఒక టాలీవుడ్ హీరోయిన్ తో ఫ్లర్ట్ చేస్తూ కనిపించారు. అది కూడా అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె సీజన్ 2 సెకండ్ ఎపిసోడ్ లో. దానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. మాస్ కా దాస్ విశ్వక్సేన్, సిద్దు జొన్నలగడ్డ నిర్మాత నాగవంశీతో కలిసి ఈ ఎపిసోడ్లో పాల్గొన్నారు. ఆ సమయంలో విశ్వక్ సేన్ తో ఒక అమ్మాయికి ఫోన్ చేసి ఇమ్మని బాలకృష్ణ కోరగా నాకు ఎవరూ తెలియదని సమాధానం చెప్పారు.


ఇక ఆ తరువాత సిద్దూ ఒక కాల్ చేసి ఇవ్వగా ఆమెతో మాట్లాడుతూ తనకు గొంతు విని అమ్మాయిలు ఎలా ఉంటారో అంచనా వేయడం తెలుసనీ మీరు చందమామ అని పేర్కొన్నారు. ఇక తాను చీకటి అని చెబుతూ మనిద్దరం కలిస్తే పున్నమి రాత్రి అంటూ పులిహోర కలిపే ప్రయతనం చేయడం ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత సిద్దు జొన్నలగడ్డ బాలకృష్ణ ఏం మాట్లాడుతున్నారా అని వినే ప్రయత్నం చేస్తుంటే నువ్వు ఇక్కడి నుంచి దూరం వెళ్ళిపో మేము మాట్లాడుకోవాలి అంటూ బాలకృష్ణ కౌంటర్ వేయడం ఆసక్తికరంగా మారింది.


ఫ్యాన్స్ అందరూ మా బాలకృష్ణ చూడండి ఎలాంటి చిలిపి పనులు చేస్తున్నాడో అంటూ కామెంట్ చేస్తుంటే, హేటర్స్ ఎప్పటిలాగానే ఆయనను విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. అయితే బాలకృష్ణ హేటర్స్ కామెంట్స్ ను అసలు ఏమాత్రం పరిగణనలోకి తీసుకోరన్న విషయం కూడా ఆయన అభిమానులు చెబుతూ ఉంటారు. మొత్తం మీద ఈ అన్ స్టాపబుల్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అనేక రికార్డులు బద్దలు కొట్టింది. ఈ సీజన్ 2 మొత్తం అలాగే రికార్డు బద్దలు కొడుతుందని ఆహా యాజమాన్యం చాలా నమ్మకంతో ఉంది. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకెలాంటి ఎపిసోడ్స్ తో ప్రేక్షకుల ముందుకు బాలకృష్ణ రాబోతున్నారు అనేది. 
Also Read: Kantara - Rangasthalam : రంగస్థలంతో కాంతారా పోలికలు.. ఈ సీన్లతోనే అలాంటి మాటలా?


Also Read: Pawan Kalyan- Balakrishna: ఫ్యాన్స్ కు మెంటలెక్కించేలా పవన్ – బాలయ్య ఫేస్ టు ఫేస్..త్రివిక్రమ్ ఫోన్ కాల్ తో మేటర్ లీక్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook