Unstoppable with NBK Season 2 Episode 1 Promo : నందమూరి బాలకృష్ణ ఆహా కోసం చేసిన అన్ స్టాపబుల్ షో ఎంతగా క్లిక్ అయిందో అందరికీ తెలిసిందే. బాలయ్యలోని మరో కోణాన్ని ప్రజల ముందు ఆవిష్కరించినట్టు అయింది. దీంతో బాలయ్య మీద అందరికీ మరింత ప్రేమ పెరిగింది. బాలయ్యలోని చిలిపి, చలాకీ, కలివిడి కోణాన్ని చూపించేశారు. అలా మొదటి సీజన్ బ్లాక్ బస్టర్ అవ్వడంతో.. రెండో సీజన్‌ను భారీ ఎత్తులో ప్లాన్ చేశారు. అందుకే రెండో సీజన్లోని మొదటి ఎపిసోడ్‌ను గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మొదటి ఎపిసోడ్‌కు తన బావ చంద్రబాబు, అల్లుడు నారా లోకేష్‌ను తీసుకొచ్చాడు. ఈ మేరకు వదిలిన ప్రోమో ఇప్పుడు వైరల్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు నా బంధువుని తీసుకొద్దామని అనుకున్నా.. కానీ ప్రజల బంధువుని తీసుకొస్తే బెటర్ అనిపించింది.. మీ అందరికీ బాబు.. నాకు బావ అంటూ చంద్రబాబు గురించి బాలయ్య అదిరిపోయే ఇంట్రడక్షన్ ఇచ్చాడు.


తనకు రెండు ఫ్యామిలీలు ఉన్నాయని బాలయ్య సరదాగా అనడం.. వసుంధరకు ఫోన్ చేస్తాను అని బాబు ఫోన్ తీయడం సరదాగా సాగింది. ఇక ఇలా సరదాగా సాగుతున్న ప్రోమోలో కాస్త సీరియస్ అంశాలను కూడా జోడించారు. వెన్నుపోటు సంఘటనలు కూడా ప్రస్థావించారు. 95లో అతి పెద్ద నిర్ణయం తీసుకున్నానని, అది తప్పు నిర్ణయమా? అని బాలయ్యను సూటిగా అడిగేశాడు బాబు. నాటి సంఘటనలను బాబు గుర్తు చేసుకున్నాడు.


తనకు అత్యంత ఆప్త మిత్రుడు వైఎస్సార్ అని బాబు చెప్పుకొచ్చాడు. నువ్ సినిమాల్లో చిలిపి పనులు చేస్తే మేం కాలేజీల్లో చేశామంటూ బాబు తన రోజులను గుర్తు చేసుకున్నాడు. ఇక నారా లోకేష్ ఎంట్రీతో ఇంకాస్త సరదాగా సాగింది ప్రోమో. బాలయ్య, చంద్రబాబులను కలిపి నారా లోకేష్ ప్రశ్నలు అడిగాడు. కాసేపు హోస్ట్‌గా మారిన లోకేష్.. బాబు, బాలయ్య పర్సనల్ విషయాలను కూపీ లాగే ప్రయత్నంచేశాడు. ఇంట్లో భార్యకు ఎవరు బాగా భయపడతారు.. వంటలు ఎవరు చేస్తారంటూ ఇలా పర్సనల్ ప్రశ్నలు వదిలాడు లోకేష్.


 



ఇక నారా లోకేష్ విదేశాల్లో తన గర్ల్ ఫ్రెండ్స్ అందరితో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను చూపించాడు బాలయ్య. ఇది అసెంబ్లీ వరకు వెళ్లిందంటూ చురకలు అంటించాడు. దీనిపై బాబు రియాక్షన్‌ను బాలయ్య అడిగాడు. మామకే లేని సందేహం నాకు ఎందుకు అని కౌంటర్ వేశాడు చంద్రబాబు. ఇలా సరదాగా సాగిన ఈ ఎపిసోడ్ గురించి అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మొదటి ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read : Krithi Shetty : కొత్త అడుగు వేయబోతోన్న కృతి శెట్టి


Also Read : Godfather Collections : బ్రేక్ ఈవెన్‌కు అందనంత దూరంలో చిరంజీవి


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook