Balakrishna Lion: నోటి మాట గర్జనలా ఉండాలి, అలా ఉండాలంటే నాలా సింహంలా పుట్టాలంటున్న బాలయ్య!
Balakrishna Lion Comments: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన క్రమంలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఆ వివరాలు
Balakrishna Lion Comments: గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వీర సింహారెడ్డి సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. నందమూరి బాలకృష్ణ కెరియర్ లోని అత్యధిక కలెక్షన్లు సాధించిన ఈ సినిమా సక్సెస్ మీట్ హైదరాబాద్ జెఆర్సీ కన్వెన్షన్ లో ఘనంగా జరిగింది. ఇక ఈ ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ చేత సింగర్స్ ఒక పాట కూడా పాడించారు. ఈ విషయం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది.
అయితే ఇదే ఈవెంట్ లో నందమూరి బాలకృష్ణ పలికిన కొన్ని డైలాగులు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన అక్కినేని తొక్కినేని అనే పదం వాడడంతో అక్కినేని అభిమానులు అయితే బాధపడుతున్నారు. అలాగే ఆయన ఒక హిందీ బూతు మాట మాట్లాడడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు సైతం ఆయనను ట్రోల్ చేస్తున్నారు. ఇక ఆయన మరికొన్ని మాటలు కూడా మాట్లాడగా అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
నటించడం అంటే కేవలం అరవడం ఏడవడం లేకపోతే ఒక నవ్వు నవ్వడం కాదని నటన అంటే పరకాయ ప్రవేశం చేయడం అని నందమూరి బాలకృష్ణ ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. అంతేకాక తను పొద్దున్నే మూడింటికి లేవగానే చుట్ట తాగుతానని ఎందుకంటే నా ఆరోగ్యం కోసం నా డైలాగ్స్ కోసం నా ఫైట్స్ కోసం అంటూ అని చెప్పుకొచ్చారు. ఇక అంతేకాక ఆ తర్వాత నోటి మాట అనేది నికార్సుగా ఉండాలని నిజాయితీగా ఉండాలని నందమూరి బాలకృష్ణ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
నోటి మాట ఒక గర్జనలా ఉండాలని పేర్కొన్న బాలకృష్ణ అలా ఉండాలి అంటే నాలాగా సింహం లాగా పుట్టాలంటూ కామెంట్స్ చేశారు. ఇక నందమూరి బాలకృష్ణ ఈ ఈవెంట్లో చేసిన దాదాపు అన్ని మాటలు వైరల్ అవుతున్నాయి. అయితే కొన్ని వ్యాఖ్యల విషయంలో చాలా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. మరి గతంలో తాను చేసిన కామెంట్స్ విషయంలో ఒక క్షమాపణ లేక విడుదల చేసిన బాలకృష్ణ ఈ విషయంలో ఎలా స్పందిస్తారని చూడాల్సి ఉంది.
Also Read: Balakrishna L Word: బాలకృష్ణ నోటి వెంట బూతు పదం... డీజే టిల్లు రియాక్షన్ చూశారా?
Also Read: Akkineni Thokkineni: బాలయ్య నోటి వెంట 'అక్కినేని తోక్కినేని'..వర్దంతి రోజే ఘోర అవమానమా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook