Nandamuri Balakrishna - Bheemla Nayak : భీమ్లా నాయక్ కోసం పవన్ కళ్యాణ్.. అది బాలయ్య సలహానే.. దటీజ్ నందమూరి నటసింహం
Nandamuri Balakrishna - Bheemla Nayak భీమ్లా నాయక్ సినిమాకు నందమూరి బాలకృష్ణకు ఓ రిలేషన్ ఉందట. ఈ సినిమాను మొదటగా బాలయ్య వద్దకే తీసుకెళ్లారట. ఈ విషయం అన్ స్టాపబుల్ సినిమాతో బయటకు వచ్చింది.
Nandamuri Balakrishna - Bheemla Nayak : నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం అన్ స్టాపబుల్ షోతో అదరగొట్టేస్తున్నాడు. మొదటి ఎపిసోడ్ నారా చంద్రబాబు, నారా లోకేష్‌లతో చేశాడు. అది బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కేవలం నాలుగు రోజుల్లోనే వంద మిలియన్ల వ్యూస్ కొల్లగొట్టేసింది. ఇక రెండో ఎపిసోడ్ ఇప్పుడు స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో విశ్వక్ సేన్, సిద్దు జొన్నలగడ్డతో బాలయ్య అల్లరి చేశాడు. నిర్మాత నాగవంశీ కూడా జాయిన్ అయ్యాడు.
అయితే నాగవంశీ ఎంట్రీతో త్రివిక్రమ్ భీమ్లా నాయక్ సినిమా ముచ్చట్లు తీసుకొచ్చాడు. అసలే భీమ్లా నాయక్ సినిమా విషయంలో రకరకాల టాక్స్ నడిచాయి. ఈ సినిమాను బాలయ్య, వెంకీ, రానా ఇలా చాలా మందితో ట్రై చేశారనే టాక్ వచ్చింది. రవితేజ కూడా నటిస్తాడనే టాక్ కూడా వచ్చింది. ఇప్పుడు తాజాగా భీమ్లా నాయక్ విషయం మీద బాలయ్య స్పందించాడు.
మామూలుగా మన హీరోలు చాలా మంది.. తమ వద్దకు వచ్చే సినిమాలను.. ఎవరికి బాగా సూట్ అవుతుందో చెప్పి మరీ.. వారిని సజెస్ట్ చేస్తుంటారు. అలా తన వద్దకు వచ్చిన భీమ్లా నాయక్ సినిమాను పవన్ కళ్యాణ్‌కు అయితే బాగుంటుందని బాలయ్య సూచించారట. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది.
భీమ్లా నాయక్ సినిమాలో ముందు హీరో ఎవరు? అని బాలయ్య అడిగాడు. మీరే కదా? సర్.. పవన్ కళ్యాణ్ గారిని మీరే సజస్ట్ చేశారు కదా? అని నిర్మాత నాగవంశీ అసలు విషయాన్ని బయటపెట్టేశాడు. దీంతో బాలయ్య గొప్పదనం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది.
మా బాలయ్య గోల్డురా అంటూ అభిమానులు ట్వీట్లు చేస్తున్నారు. కల్మషం లేని మనిషిరా బాలయ్య అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీ మధ్య కోల్డ్ వార్ ఉందనే ప్రచారం జరుగుతుంటుంది.క కానీ అది నిజం కాదని ఈ ఘటనతో అర్థమైంది. ఒక వేళ అలాంటి గొడవలే ఉంటే.. తన వద్దకు వచ్చిన చిత్రాన్ని పవన్ కళ్యాణ్‌కు బాగుంటుందని సూచించడు కదా? అని నెటిజన్లు అంటున్నారు.
Also Read : Ori Devuda Vs Ginna : విశ్వక్ సేన్‌ను కూడా దాటని మంచు విష్ణు
Also Read : Actress Anjali Pavan : అమ్మ మాత్రమే.. నాన్న లేరు.. స్టేజ్ మీద ఏడిపించేసిన మొగలిరేకులు అంజలి పవన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook