Balakrishna Targetted YS Jagan: జగన్ ను టార్గెట్ చేసిన బాలయ్య.. చరిత్ర అంటూ కౌంటర్లు!
Nandamuri Balakrishna Targetted YS Jagan: నందమూరి బాలకృష్ణ తన సినిమా ట్రైలర్ ద్వారా వైఎస్ జగన్ ను టార్గెట్ చేసిన వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఆ వివరాలు
Nandamuri Balakrishna Targetted YS Jagan Through Veera Simha Reddy Trailer: నందమూరి బాలకృష్ణ తన సినిమా ట్రైలర్ ద్వారా వైఎస్ జగన్ టార్గెట్ చేసినట్లయింది. నందమూరి బాలకృష్ణ హీరోగా వీరసింహారెడ్డి అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. జనవరి 12వ తేదీన సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒంగోలు వేదికగా ఘనంగా జరిగింది.
ఇక ఈ ఈవెంట్ లో ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ విడుదల చేయగా ట్రైలర్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమా ట్రైలర్ లో భాగంగా ఒక డైలాగ్ మాత్రం అందరినీ ఆకర్షించింది. ఒక సంతకంతో బోర్డు మీద పేరు మార్చగలరేమోగానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మార్చలేను అంటూ నందమూరి బాలకృష్ణ పేర్కొనడంతో ఇది వైఎస్ జగన్ ను, ఆయన ప్రభుత్వాన్ని ఉద్దేశించి పలికించిన డైలాగ్ అని నందమూరి బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు వైసీపీ వారు కూడా భావిస్తున్నారు.
గతంలోనే విజయవాడ కేంద్రంగా ఏర్పడిన డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ గా మారుస్తూ వైఎస్ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి ఉండవచ్చు కానీ ఆయన డాక్టర్ కాదు కాబట్టి డాక్టర్ అయిన తన తండ్రి పేరే దానికి సబబుగా ఉంటుందని వైయస్ జగన్ క్లారిటీ కూడా ఇచ్చారు.
అయితే ఈ విషయాన్ని అప్పట్లోనే టీడీపీ పెద్ద ఎత్తున ఖండించింది, బాలకృష్ణ కూడా అప్పట్లో ఘాటుగా వ్యాఖ్యలు చేస్తూ ఫేస్బుక్ వేదికగా ఒక పోస్ట్ కూడా షేర్ చేశారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో ఇది తప్పని మీడియా ముఖంగా కూడా హెచ్చరించారు. అయితే ఇప్పుడు సినిమా ట్రైలర్ ద్వారా ఈ డైలాగ్ పలికించడం చూస్తుంటే సినిమాలో మరిన్ని డైలాగులు వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసే విధంగా ఉంటాయని అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Also Reddy: Tunisha Sharma Death: తునీషా శవమై ఉంటే సీక్రెట్ గర్ల్ ఫ్రెండ్ తో షీజాన్ ఛాటింగ్.. గంట పాటు అలాగే?
Also Reddy: Veera Simha Reddy Trailer: ఒంటి చేత్తో ఊచకోత కోస్తా ** కొడకా..పూనకాలు తెప్పిస్తున్న వీరసింహారెడ్డి ట్రైలర్!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook