Ma Bava Manobhavalu : మా బావ మనోభావాలు.. దుమ్ములేపిన బాలయ్య.. దరువేసిన తమన్
Ma Bava Manobhavalu Song Out నందమూరి బాలకృష్ణ వీర సింహా రెడ్డి సినిమా నుంచి మూడో పాటను తాజాగా మేకర్లు రిలీజ్ చేశారు. మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయే అంటూ సాగే ఈ పాట ఫుల్ మాస్‌గా ఉంది. ఇక ఈ ఐటం నంబర్లో బాలయ్య స్టెప్పులు బాగానే వైరల్ అవుతున్నాయి.
Ma Bava Manobhavalu Song Out బాలయ్య వీర సింహా రెడ్డి నుంచి మూడో పాట వచ్చింది. మా బావ మనోభావాల్ దెబ్బతిన్నాయ్ అంటూ తమన్ కొట్టిన మాస్ బీటుకు బాలయ్య అదరగొట్టేశాడు. మాస్ నంబర్ల మీదే తమన్ ఫోకస్ పెట్టినట్టున్నాడు. జై బాలయ్య, సుగుణ సుందరి కూడా మాస్ బీట్సే. ఇప్పుడు మా బావ అంటూ మరోసారి మాస్ ట్యూన్‌తో తమన్ తన స్టైల్లో దరువేశాడు. తమన్ డప్పుల సౌండ్‌కు బాలయ్య వేసిన స్టెప్పులు వైరల్ అవుతున్నాయి.
అసలే వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య మధ్య పాటల పోటీ నడుస్తోంది. పైకి ఇది చిరు వర్సెస్ బాలయ్య లానే అనిపిస్తున్నా.. లోలోపల మాత్రం దేవీ శ్రీ ప్రసాద్ వర్సెస్ తమన్ అన్నట్టుగా ఉంది. వీర సింహా రెడ్డి నుంచి వస్తోన్న పాటలు, తమన్ కొట్టిన ట్యూన్లకు జనాలు అంతగా అట్రాక్ట్ అవ్వడం లేదు. అటు వాల్తేరు వీరయ్య కోసం దేవీ కొడుతున్న పాటలు హిట్ అవుతున్నాయి. బాస్ పార్టీ, చిరంజీవి శ్రీదేవీ సాంగ్స్ బాగానే క్లిక్ అయ్యాయి.
మూడో పాట విషయంలోనూ పోటీ నెలకొనేలా ఉంది. ఈ క్రమంలోనే బాలయ్య ఈ మూడో పాటలో దుమ్ములేపేశాడు. వీర సింహా రెడ్డి నుంచి రాబోతోన్న ఈ థర్డ్ సింగిల్ ఐటం నంబర్‌గా అనిపిస్తోంది. ఈ పాటలో బాలయ్య తన ఎనర్జీని మరోసారి చూపించాడు. తమన్ ఎప్పటిలానే తన డప్పులతో దరువేసినట్టు కనిపిస్తోంది.
రామ జోగయ్య శాస్త్రి మరోసారి తన కలానికి పదునుపెట్టేశాడు. అయితే ఈ పాటకు పోటీగా వాల్తేరు వీరయ్య నుంచి ఎలాంటి పాట బయటకు వస్తుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సంక్రాంతికి మాత్రం బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ నెలకొనేలా ఉంది. ఏ సినిమా హిట్ అయినా కూడా నిర్మాణ సంస్థ మైత్రీయే కాబట్టి.. అంత పెద్దగా నష్టాలు రాకపోవచ్చు. ఏ ఒక్క సినిమాకు బ్లాక్ బస్టర్ టాక్ వచ్చినా కలెక్షన్లు మోత మోగిపోవడం మాత్రం ఖాయం.
Also Read : Top Heroine in 2022 : ఈ ఏడాది బ్యాడ్ లక్ సఖిలు వీళ్లే.. నక్క తోక తొక్కిన హీరోయిన్లు ఎవరంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook