Balakrishna Bhagwant Kesari Release Date Announced: నందమూరి బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో తెరకెక్కుతున్న చిత్రం 'భగవంత్ కేసరి'(Bhagwant Kesari). 'ఐ డోంట్ కేర్' అనేది ట్యాగ్ లైన్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీలీల శరత్ కుమార్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అఖండ', 'వీరసింహారెడ్డి' సినిమాల తర్వాత బాలయ్య నుంచి వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ను ప్రకటించింది మూవీ టీమ్. భగవంత్ కేసరి సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేసి.. విడుదల తేదీని ప్రకటించేసింది. ఈ మూవీని దసరా కానుకగా అంటే అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా తెలిపింది. భగవంత్ కేసరి ఆయుధ పూజతో గీ సారి దసరా జోర్దారుంటది అని చిత్రయూనిట్ తెలిపింది. 



Also Read: Kanguva Movie: గెట్‌ రెడీ.. సూర్య 'కంగువా' గ్లింప్స్‌ వచ్చేస్తోంది..


ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తెలంగాణ యాసలో బాలయ్య చెప్పిన డైలాగ్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ సినిమాలో నటసింహన్ని ఢీకొట్టే పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ నటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహూ గారపాటి-హరీష్ పెద్ది కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. 


Also Read: Varun Tej-Lavanya: వరుణ్ – లావణ్య పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook