Taraka Ratna Death Reason: తారకరత్న చావుకు అదే కారణం.. అసలు ఏమైందంటే?
Taraka Ratna Death Reason: 23 రోజుల పాటు చికిత్స పొందిన తారకరత్న అనూహ్యంగా శివరాత్రి నాడే కన్నుమూశారు, అసలు తారక రత్న మృతికి కారణం ఏమిటో తెలుసా?
Nandamuri Taraka Ratna Death Reason: నందమూరి తారకరత్న అనారోగ్య కారణాలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. నందమూరి మోహనకృష్ణ- శాంతి దంపతులకు ఫిబ్రవరి 22వ తేదీన ఆయన జన్మించారు. 1983 వ సంవత్సరంలో అంటే సరిగ్గా ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశానికి కొద్ది నెలల ముందు ఆయన జన్మించారు. దీంతో ఆయనని ఇంట్లో అందరూ చాలా స్పెషల్ గా చూసేవారు. ముందు సినిమాల్లో ఎంట్రీ ఇచ్చినా, సినిమాల్లో తగిన గుర్తింపు రాకపోవడంతో ఇక రాజకీయాలలో యాక్టివ్ కావాలని తారకరత్న ప్రయత్నించారు.
ఆయన మరణించడానికి కొన్ని నెలల క్రితం గుంటూరులో చేసిన ఒక పర్యటన సూపర్ సక్సెస్ కావడంతో ఆయన గుంటూరు జిల్లా నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. ఆ తరువాత బాలకృష్ణ ప్రస్తుతం పోటీ చేస్తున్న హిందూపురం నుంచి లేదా తెలుగుదేశానికి గట్టి పట్టున్న గుడివాడ నుంచి పోటీ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ ఆయన అనూహ్యంగా మృత్యువాత పడ్డారు. నారా లోకేష్ ప్రారంభించిన పాదయాత్రలో మొదటి రోజు పాల్గొన్న తారకరత్న నడుస్తూ నడుస్తూ కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను కుప్పంలోనే స్థానిక ఆసుపత్రికి తరలించారు.
తరలించేందుకు 45 నిమిషాలు పట్టగా ఆ 45 నిమిషాల పాటు ఆయన గుండె ఆగిపోయింది. తరువాత వైద్యులు తమ ప్రయత్నం తాము చేసి మళ్లీ గుండె కొట్టుకునేలా చేశారు. అయితే తారకరత్న గుండెపోటుకు గురైన సమయంలో మెదడుకు దాదాపు 45 నిమిషాల పాటు రక్త ప్రసరణ ఆగిపోయిందని వైద్యులు గుర్తించారు. అలా ఆగిపోవడం వల్ల మెదడులోని కొంత భాగం దెబ్బతిన్నదని, దాన్ని తిరిగి రికవరీ చేసే ప్రయత్నం చేస్తున్నామని, ముందు నుంచి వైద్యులు చెబుతూ వచ్చారు. ఇక మెదడులో నీరు చేరడం వల్ల ఆ రికవరీ ప్రాసెస్ కి ఇబ్బంది ఏర్పడిందని తేలింది.
గుండె సహ కాలేయం పనితీరు మెరుగుపడినప్పటికీ మెదడులోని కీలకమైన భాగం దెబ్బ తినడంతో తారకరత్న కోలుకోలేకపోయారని తెలుస్తోంది. అందుకే చాలా రోజుల పాటు ఎక్మో సపోర్ట్ మీద ఉంచిన వెంటిలేటర్ సపోర్ట్ తో ఆయనను ఎక్కువ కాలం ఉంచినా బతికించలేకపోయారని చెబుతున్నారు. ఆయనను ఇక్కడి నుంచి విదేశాలకు తరలించి వైద్య సహాయం అందించాలని ముందుగా నిర్ణయించారు. ఆస్ట్రేలియా, లండన్ లేదా అమెరికా వంటి దేశాలకు తీసుకువెళ్లాలని భావించినా ఫ్లైట్లో అంతసేపు ట్రావెల్ చేయించడం కరెక్ట్ కాదని భావించి చివరికి ఆయా దేశాల నుంచి భారీ ఖర్చుతో నిపుణులైన వైద్యులను తీసుకువచ్చారు. వారు కూడా తమ సాయశక్తులా ప్రయత్నించారు కానీ ఆయనను కాపాడలేకపోయారు.
Also Read: Taraka Ratna Unlucky: 9 నెంబర్ అసలు కలిసిరాని తారకరత్న.. అందుకే ఇలా అయిందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook