Box Office Clash : యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాల జాబితా లో ఒకటిగా నిలిచిన అదుర్స్ తో పాటు మెగాస్టార్ చిరంజీవి కి పెద్ద హిట్ ఇచ్చిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలు ఈ ఏడాది నవంబర్‌ లో మళ్లీ పునః విడుదల కానున్నాయి. ఈ మధ్య రీ రిలీజ్‌ ల ట్రెండ్ టాలీవుడ్ లో బాగానే నడుస్తోంది కానీ బాక్సాఫీస్ వద్ద అంత కలెక్షన్లు నమోదు చేయలేకపోతున్నాయి. ఉదాహరణ కు సూపర్ స్టార్ మహేష్ బాబు బిజినెస్‌ మెన్ రీ-రిలీజ్ మాత్రమే కలెక్షన్ల పరంగా మంచి రెస్పాన్స్ అందుకుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇప్పుడు రెండు పెద్ద హీరో సినిమాలు నవంబర్‌ లో రీ రిలీజ్ అవ్వనున్నాయి. మెగాస్టార్ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్ నవంబర్ 4న విడుదల కానుండగా, ఎన్టీఆర్ అదుర్స్ సినిమా నవంబర్ 18న విడుదల కానుంది. మరి ఈ రెండు రీ రిలీజ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఎలా వర్కవుట్ అవుతాయో ఇప్పుడు వేచి చూడాలి. మరి బాక్సాఫీస్ వద్ద ఈ రెండిటి లో ఏ సినిమా డామినేట్ చేస్తుందో చూడాలి.


నవంబర్ లో పెద్ద చెప్పుకోదగ్గ సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. దీంతో రీ రిలీజ్ అవుతున్న రెండు సినిమాలకి ఎక్కువ స్క్రీన్ లు లభించి లాభాలు కూడా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన అదుర్స్‌ లో నయనతార, షీలా హీరోయిన్ లుగా నటించారు. సాయాజీ షిండే, నాసర్, తనికెళ్ల భరణి వంటి తదితరులు కీలక పాత్రలు పోషించారు. 


సినిమా సూపర్ హిట్ కాకపోయినప్పటికీ కలెక్షన్ల పరంగా పరవాలేదు అనిపించింది. 26 కోట్ల బడ్జెట్ తో విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద 29 కోట్లను వసూలు చేసింది. మరోవైపు 2004లో కామెడీ-డ్రామాగా విడుదల అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ కి జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించగా, సోనాలి బిండ్రే హీరోయిన్ గా నటించింది. పరేష్ రావల్, శ్రీకాంత్ కీలక పాత్రల్లో కనిపించారు. 


హిందీలో సూపర్ హిట్ అయిన మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాకి రీమేక్ గా విడుదలైన ఈ చిత్రం అప్పటి లో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. వంద రోజులపాటు విజయవంతంగా థియేటర్లలో రన్ అయిన ఈ సినిమా అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఆసక్తికరంగా దేవి శ్రీ ప్రసాద్ ఈ రెండు సినిమాలకు సంగీతం అందించారు.


Also Read: Jio Annual Plans: కొత్తగా జియో ప్రీపెయిడ్ వార్షిక ప్లాన్స్ ఈ ఓటీటీలు ఉచితం


Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook