Venkatesh Maha KGF : కేజీయప్పై వెంకటేష్ మహా కామెంట్లు.. థియేటర్ బయట అంటూ పరువుతీసిన నాని
KGF And Commercial Movies కేజీయఫ్, కమర్షియల్ సినిమాల గురించి వెంకటేష్ మహా, శివ నిర్వాణ, ఇంద్రగంటి, నందినీ రెడ్డి వంటి వారంతా కూడా కలిసి ముచ్చట్లు పెట్టారు. ఈ క్రమంలో కేజీయఫ్ సినిమాను దారుణంగా ట్రోల్ చేశారు.
Nani on Venkatesh Maha కమర్షియల్ సినిమాల గురించి నందని రెడ్డి, శివ నిర్వాణ, ఇంద్రగంటి మోహన్‌కృష్ణ, వివేక్ ఆత్రేయ, వెంకటేష్ మహా వంటి వారు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. వీరంతా క్లాస్ సినిమాలను తీస్తూ అడపాదడపా ఆడియెన్స్‌ను మెప్పిస్తూ వస్తున్నారు. తాము ఏదో గొప్ప సినిమాలను తీసి ఇండస్ట్రీని ముందుకు నడిపిస్తున్నట్టుగా కాస్త బిల్డప్ ఇచ్చారు. తామే మంచిగా చదివే స్టూడెంట్లమని, చదవని స్టూడెంట్లకు మార్కులు వేస్తున్నారంటూ తెగ ఎక్స్ ట్రాలు మాట్లాడేశారు.
నందినీ రెడ్డి తీసినవాటిల్లో అలా మొదలైంది మాత్రమే హిట్. ఓ బేబీ పర్వాలేదనిపించింది. ఇక శివ నిర్వాణ ఖాతాలో మజిలీ, నిన్ను కోరి వంటి హిట్లున్నాయి. వెంకటేష్ మహా తీసిందే ఒక సినిమా. రెండోది రీమేక్. వివేక్ ఆత్రేయకు మంచి పేరే ఉంది. అయితే ఇలాంటి దర్శకులంతా కలిసి కమర్షియల్ సినిమాల మీదు తమకున్న ద్వేషాన్ని, చులకనభావాన్ని ప్రదర్శించారు.
ఓ ఫిల్మ్ మేకర్‌లా కాకుండా.. థియేటర్ బయట వాగే కామన్ మేన్‌లా గోలగోల చేశారు. పరుషమైన పదాలను వాడేశారు. వెకిలి నవ్వులు నవ్వేశారు. రాకీ భాయ్ అనేవాడు నీచ్ కమీన్ కుత్తే అంటూ వెంకటేష్ మహా నోటికి ఎంత వస్తే అంత అనేశాడు. దానికి మిగతా వారంతా కూడా చప్పల్లు కొడుతూ పళ్లు ఎకిలించారు. అయితే తాను మాట్లాడిన విధానం తప్పేమో గానీ తన అభిప్రాయం తప్పు కాదని వెంకట్ మహా క్లారిటీ ఇచ్చాడు. మిగిలిన దర్శకులు కూడా తమ మీద జరుగుతున్న ట్రోలింగ్‌కు రియాక్ట్ అయ్యారు. సారీ చెప్పారు.
ఇప్పుడు నాని ఈ వివాదం మీద స్పందించాడు. ఆ మాట్లాడిన ఐదుగురు డైరెక్టర్లలో నలుగురు తన డైరెక్టర్లేనని, అయితే తమ అభిప్రాయాలు బయటకు చెప్పుకోవడం తప్పు కాదు కానీ అలా మాట్లాడటం తప్పు.. ఏదో థియేటర్ బయట మాట్లాడినట్టుగా మాట్లాడారు.. ఇంటర్వ్యూలో అలాంటి డైరెక్టర్లు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అంటూ వారి పరువుతీసేశాడు నాని.
Also Read: Shruti Haasan : నెటిజన్ల తిక్క ప్రశ్నలు.. శ్రుతి హాసన్ సమాధానాలివే.. ఛీ ఛీ ఇదేం దరిద్రం!
Also Read: Nidhhi Agerwal : జోరు పెంచేసిన నిధి అగర్వాల్.. అదరహో అనాల్సిందే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook