Dasara Vs Ravanasura Collections: టాలీవుడ్ లో ఇప్పుడు ఆసక్తికరమైన ఫైట్ నడుస్తోంది, అదేమంటే నాని vs రవితేజ. అదేంటి ఈ ఫైట్ ఏంటి అనుకుంటున్నారా? వాస్తవానికి నాని హీరోగా నటించిన దసరా సినిమా, రవితేజ హీరోగా నటించిన రావణాసుర సినిమాలు ప్రస్తుతము థియేటర్లలో కొనసాగుతున్నాయి. ఈ సినిమాలతో పాటు ఇతర చిన్నాచితకా సినిమాలు కూడా ఉన్న ఈ రెండు ప్రధానమైన సినిమాల మధ్య కలెక్షన్స్ వార్ నడుస్తోంది. ఇక సినిమా ఇప్పటికే 12 రోజుల దియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరోపక్క రవితేజ హీరోగా రూపొందిన రావణాసుర సినిమా ఈ మధ్యనే ఏప్రిల్ ఏడవ తారీఖున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమా కూడా దాదాపుగా నాలుగు రోజుల దియేట్రికల్ రన్ పూర్తి చేసుకుంది. అయితే ఎప్పుడో విడుదలైన నాని దసరా సినిమా ఈ మధ్యన విడుదలైన రావణాసుర సినిమాని కలెక్షన్స్ విషయంలో డామినేట్ చేస్తోందనే వాదన వినిపిస్తోంది. ఒకసారి ఈ రెండు సినిమాల రోజు వారి కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే విషయాన్ని పరిశీలిస్తే దసరా సినిమా దాదాపు 8 రోజులపాటు కోటి రూపాయలకు తగ్గకుండా వసూళ్లు సాధించింది.


Also Read: Samyuktha Menon Photos: బ్లూ డ్రెస్సులో అప్సరసలా మెరుస్తోన్న సంయుక్త మీనన్.. అదిరే ఎద అందాల జాతర!


అయితే తొమ్మిదవ రోజు కలెక్షన్స్ 80 లక్షలకు పడిపోగా పదవరోజు మళ్ళీ కోటి రూపాయల వసూళ్లు చేసింది. 11వ రోజు 93 లక్షలు, 12వ రోజు 39 లక్షలు వసూలు చేసింది ఈ సినిమా. మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో 12 రోజులకు గాను 42 కోట్ల 70 లక్షల షేర్ వసూలు చేయగా 71 కోట్ల 95 లక్షల గ్రాస్ చేసింది. ఇక ఓవర్సీస్ సహా ఇతర భాషలు, నార్త్ ఇండియా అన్ని కలిపి 61 కోట్ల షేర్, 19 కోట్ల 65 లక్షల గ్రాస్ వసూలు చేసింది. హక్కులు అమ్ముడుపోయిన దాని మేరకు ప్రస్తుతానికి ఈ సినిమా 12 కోట్ల లాభంతో దూసుకుపోతోంది.


ఇక రవితేజ హీరోగా రూపొందించిన రావణాసుర విషయానికి వస్తే మొదటి రోజు నాలుగు కోట్ల 29 లక్షలు, రెండవ రోజు రెండు కోట్ల 25 లక్షలు, మూడవరోజు కోటి 78 లక్షలు వసూలు చేయగా నాలుగో రోజు కేవలం 50 లక్షలు మాత్రమే వసూలు చేసింది.  ఇక సోమవారం కావడంతో వసూళ్లలో డ్రాప్ కనిపిస్తోంది. ఇక దాదాపుగా అదే రోజు దసరా సినిమా కూడా దగ్గర దగ్గర 10 లక్షల తేడాతో 39 లక్షలు వసూలు చేయడం గమనార్హం. ఇక రావణాసుర సినిమా నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా 10 కోట్ల 54 లక్షల షేర్ వసూలు చేయగా 18 కోట్ల 90 లక్షల గ్రాస్ వసూలు చేసింది. ఈ సినిమా హిట్ కావాలంటే ఇంకా 12 కోట్ల 46 లక్షలు వసూలు చేయాల్సి ఉంది.


Also Read: Alekhya Harika Photos: ఘాటైన అందాలతో తెలంగాణ మిర్చి అలేఖ్య హారిక.. కవ్విస్తూ చంపేస్తోందిగా!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook