Dasara Movie Ticket @ Rs.112: టికెట్ రేట్లు తగ్గించిన దసరా టీం.. రూ.112 కే దసరా సినిమా టికెట్
Dasara Team Reduced Ticket Price: నాని దసరా సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడేస్తోంది. ఇప్పటికే అన్ని చోట్ల ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టుగా కనిపిస్తోంది. జరిగిన బిజినెస్‌కు సోమవారం వరకు వచ్చిన లెక్కలకు అంతా సరిపోయిందని టాక్.
Dasara Movie Reduced Ticket Rates: నాని దసరా మూవీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. బాక్సాఫీస్ వద్ద నాని సందడిగ మామూలుగా లేదు. ఇక ఈ రోజు సాయంత్రం కల్లా ఈ సినిమా వంద కోట్ల క్లబ్బులో చేరేలా ఉంది. బుధవారం నాడు వంద కోట్ల పోస్టర్‌తో నాని సందడి చేసేలా ఉన్నాడు. మొత్తానికి నాని మొదటి వంద కోట్ల సినిమా అవ్వనుంది. అయితే ఈ సినిమాకు నార్త్‌లో ఎక్కువగా ఆదరణ లభించడం లేదు. దీంతో చిత్రయూనిట్ ఓ నిర్ణయం తీసుకుంది. టికెట్ రేట్లను తగ్గించింది. అలా అయినా జనాలు వస్తారేమో అని దసరా టీం ఆశిస్తోంది.
రెండు తెలుగు రాష్ట్రాల్లో నాని సినిమా బాగానే ఆడుతోంది. ఇప్పటి వరకు 97 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టేసింది. దసరా సినిమాతో నాని బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తున్నాడు. నాని మాస్ సినిమా చేస్తే రిజల్ట్ ఎలా ఉంటుందో మరోసారి చూపించాడు. నాని కెరీర్‌లో కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ అయిన సినిమాలన్నీ కూడా మాస్ ఫార్మూలతో తెరకెక్కించినవే.
ఎంసీఏ, నేను లోకల్ వంటి సినిమాలు బాగా ఆడాయి. ఇప్పుడు మళ్లీ చాలా కాలం తరువాత సరైన మాస్ సినిమాతో వచ్చాడు.అసలే ఇప్పుడు పుష్ప, కేజీయఫ్‌ల టైం కాబట్టి దసరాను కూడా పాన్ ఇండియన్ మూవీగా రిలీజ్ చేశాడు. అయితే తెలుగు భాషలో తప్పా మిగతా ఎక్కడా కూడా దసరా అంతగా ఆడటం లేదు. దీంతో నార్త్ ఏరియాలో టికెట్ రేట్లను తగ్గించాడు. గరిష్టంగా రూ. 112 టికెట్ రేట్‌ను ఫిక్స్ చేశారు. మరి రేట్లు తగ్గించడం వల్లనైనా జనాలు వస్తారా? రారా? అన్నది చూడాలి.
ఇక ఇదే విషయం మీద నానిని ప్రశ్న వేస్తే.. తానేమైనా అమితాబ్ బచ్చనా?.. మొదటి రోజే జనాలు థియేటర్లకు రావడానికి..కాస్త టైం పడుతుంది.. మెల్లిగా పికప్ అవుతుంది అంటూ నాని చెప్పుకొచ్చింది. అయితే నాని దసరా మాత్రం రెస్టాఫ్ ఇండియాలో ఫ్లాపుగానే మిగిలేట్టుంది.
Also Read: Devi Sri Prasad Marriage : ఇన్నాళ్లకు పెళ్లి చేసుకోబోతోన్న దేవీ శ్రీ ప్రసాద్.. ఎంత ఏజ్ గ్యాప్ అంటే?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook