Ante Sundaraniki: నాచురల్ స్టార్ నాని వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఇటీవలే 'శ్యామ్ సింగరాయ్​'తో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న నాని.. కొత్త సినిమా అప్​డేట్ (Nani New movie Update) ఇచ్చారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'అంటే సుందరానికీ' టైటిల్​తో వస్తున్న నాని కొత్త సినిమా పనులు శరవేగంగా (Ante Sundaraniki updates) జరుగుతున్నాయి. ఈ సినిమాలో నానిపేరు సుందర ప్రసాద్. కొత్త సంవత్సరం సందర్భంగా నాని ఫస్ట్ లుక్ విడుదల (Ante Sundaraniki Film Nani First look) చేయనుంది చిత్ర యూనిట్​. ఈ విషయాన్ని నాని స్వయంగా ట్విట్టర్ ద్వారా (Nani on Ante Sundaraniki) వెల్లడించారు. జనవరి 1న సాయంత్రం 4.05 గంటలకు సుందర్​ ఫస్టలుక్​ను పరిచయం చేయనున్నట్లు తెలిపారు.



'అంటే సుందరానికీ' సినిమా విశేషాలు..


ఈ సినిమాలో మలయాళీ ముద్దుగుమ్మ నజ్రియా తొలిసారి తెలుగులో (Nazriya Nazim first Telugu Movie) హీరోయిన్​గా నటిస్తుండటం విశేషం. ఇప్పటికే వరకు నేరుగా తెలుగులో నటించకున్నా నజ్రియా ఇక్కడ ఎంతో పాపులారిటీ తెచ్చుకున్నారు. రాజా రాణి అనే తమిళ్​ డబ్బింగ్ సినిమా ద్వారా ఆమె తెలుగు తెరకు పరిచయం అయ్యారు. అమె నటనకు మంచి గుర్తింపు ఉంది.


ఇక ఈ సినిమాకు వివేక్ ఆత్రేయ డైరెక్టర్​. మెంటల్ మదిలో, బ్రోచేవరెవరురా వంటి సినిమాలను వివేక్ ఆంత్రేయ డైరెక్ట్ (Vivek Athreya Films) చేశారు. మైత్రీ మూవీ మేకర్స్​ బ్యానర్​లో నవీన్ యెర్నేనీ, వై.రవి శంకర్​ ప్రొడ్యూసర్లు.


Also read: RRR Movie: ఆర్‌ఆర్‌ఆర్‌ టైటిల్‌ని ఎందుకు పెట్టారో చెప్పేసిన రాజమౌళి.. కారణం అభిమానులే అట!!


Also read: Nora Fatehi: బాలీవుడ్‌ను భయపెడుతున్న కరోనా.. వైరస్ బారినపడ్డ మరో నటి...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook