Nani: హాయ్ నాన్న కోసం కేసీఆర్ గా మారిన నాని…
Hi Nanna promotions: నాని ఏ సినిమాకి చేయనంత విభిన్నంగా తన తదుపరి సినిమా హాయి నాన్నకి ప్రమోషన్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ సీఎం కేసీఆర్ ని ఇమిటేట్ చేస్తూ తన సినిమాని నాని ప్రమోట్ చేసిన తీరు చూస్తే మనందరికీ నాని నిజంగానే నేచురల్ స్టార్ అనిపించక మానదు.
Hi Nanna : వైవిద్యమైన సినిమాలు చేయడంలో అలానే వైవిద్యమైన పాత్రలు పోషించడంలో ముందుంటారు నాని. దసరా లాంటి సూపర్ హిట్ తరువాత ఇప్పుడు మళ్లీ మన ముందుకి తన హయ్ నాన్న సినిమాతో రానున్నారు. నాని, మృణాల్ ఠాకూర్ జంటగా శౌర్యవ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం హయ్ నాన్న. డిసెంబర్ 7 న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కాగా ఈ సినిమా విడుదల తేదీ ముందర పడుతూ ఉండటంతో ఈ చిత్ర ప్రమోషన్స్ ని చాలా స్ట్రాంగ్ గా జరుపుతున్నాడు నాని.
ఇప్పుడు ట్రెండింగ్ లో ఏ అంశం అయితే ఉన్నదో దాంతోనే ప్రమోషన్స్ మొదలుపెట్టాడు. అంతేకాదు ఇప్పటివరకు ఏ సినిమాకి చేయనంత వెరైటీగా ఈ చిత్రానికి ప్రమోషన్ చేస్తున్నారు నాని.
తెలంగాణలో ప్రస్తుతం ఎలక్షన్స్ హీట్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందుకే తన ప్రమోషన్స్ లో ఎలక్షన్స్ వాడేశాడు. రెండు రోజుల నుంచి ఎలక్షన్స్ కి సంబంధించిన ఒక పోస్టర్ అలానే చిన్న వీడియో రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించిన నాని ఈరోజు ఏకంగా ఒక పెద్ద వీడియో పెట్టి అందరిని సూపర్ గా ఆకట్టుకున్నాడు. ముందుగా ఈ మధ్యనే హయ్ నాన్న పార్టీ ప్రెసిడెంట్ గా ఎన్నికయిన విరాజ్ అని ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు. అందులో తమకే ఓటు వెయ్యాలని తెలిపాడు. ఇక ఇప్పుడు పార్టీ మీటింగ్ కూడా పెట్టేశాడు.
కాదా ఇందులో గమనించాల్సిన విషయం ఏమిటి అంటే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నే ఇమిటేట్ చేస్తూ మాట్లాడాడు. తెలంగాణ ముఖ్యమంత్రి ప్రెస్మీట్లో రిపోర్టర్స్ తో ఎలా అయితే మాట్లాడతారో అలానే మాట్లాడి అందరిని ఆకట్టుకున్నారు. కెసిఆర్ ఎలా అయితే ఫన్నీగా కొన్ని మాటలు చెబుతారో అవన్నీ అచ్చు గుద్దినట్లు నాని ఇమిటేట్ చేశాడు. అక్కడ కేసీఆర్ ప్రజల గురించి మాట్లాడితే .. ఇక్కడ నాని తన సినిమా గురించి మాట్లాడాడు.. అంతే తేడా మిగతాదంతా సేమ్ టు సేమ్.
సినిమాలో నార్త్ ఇండియా ఏంటి ..సౌత్ ఇండియా ఏంటి.. క్లాస్ సినిమా ఏంటి.. మాస్ సినిమా ఏంటి ప్రేక్షకులకు కావాల్సింది ఎంటర్టైన్మెంట్ అంటూ వీడియో మధ్యలో కేసీఆర్ స్టైల్లో భలే చెప్పాడు నాని. ఇక
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఇక నాని ప్రమోషన్స్ తీరని ప్రేక్షకులు తెగ అభినందిస్తున్నారు.
Also Read: World Cup 2023: ఐసీసీ ప్రపంచకప్ 2023 విజేతకు రన్నర్ జట్లకు ఇచ్చే ప్రైజ్‌మనీ ఎంతంటే
Also Read: Poco M4 5G Price: 50MP కెమెరా Poco M4 5G మొబైల్‌ను ఫ్లిప్‌కార్ట్‌లో కేవలం రూ.11,000లోపే పొందండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook