Nani On Venkatesh Maha: `నీచ్ కమిన్ కుత్తే` కామెంట్లపై నాని స్పందన.. జడ్జ్ చేయను అంటూ..
Nani Responds On Venkatesh Maha Comments: కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన కేజిఎఫ్ 2 సినిమా మీద తెలుగు దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యల మీద నాని స్పందించారు. ఆ వివరాలు
Nani Responds On Venkatesh Maha Comments On KGF 2 Movie: కన్నడ సినీ పరిశ్రమ స్థాయిని పెంచిన కేజిఎఫ్ 2 సినిమా మీద తెలుగు దర్శకుడు వెంకటేష్ మహా చేసిన వ్యాఖ్యలు సంచలనం మారిన సంగతి తెలిసిందే. యష్ పోషించిన రాఖీ భాయ్ పాత్రను ఉద్దేశిస్తూ అలాంటి నీచ్ కమీన్ కుత్తే ఎవరైనా ఉంటారా అలాంటి సినిమాలకు మనం చప్పట్లు కొడుతున్నాం అంటూ అటు తీసిన దర్శకుడిని చూసి చప్పట్లు కొట్టిన ప్రేక్షకులను కించపరిచే విధంగా కామెంట్లు చేశారు. ఆ తర్వాత తన ఉద్దేశం కరెక్టే కానీ చెప్పిన విధానం కరెక్ట్ కాదంటూ దానిని కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.
ఇక తాజాగా ఇదే అంశం మీద దసరా హీరో నాని స్పందించారు. కీర్తి సురేష్ హీరోయిన్గా శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో రూపొందిన దసరా సినిమా మార్చి 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల అవబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ అంశం మీద మాట్లాడారు.ఇటీవల ఐదుగురు డైరెక్టర్స్ కలిసి పాల్గొన్న ప్రోగ్రాం చూశానని అందులో నలుగురు దర్శకులు నాతో కలిసి పని చేసిన వాళ్లే అని అన్నారు. వెంకటేష్ మహా ఏం మాట్లాడాడో ఆ మాట్లాడిన విధానం కరెక్ట్ కాదు దీని గురించి మహా ఇప్పటికే వివరణ ఇచ్చారని అన్నారు.
ఇక తన ఉద్దేశం ప్రకారం ఒక సినిమా చూసిన తర్వాత థియేటర్ నుంచి బయటకు వచ్చి దాని గురించి మన ఫ్రెండ్స్ తో ఒక టోన్లో చెబుతాము, ఇంటర్వెల్ లో కొన్ని మాట్లాడుతాం ఆరోజు చర్చ కూడా ధియేటర్ బయట జరిగిన డిస్కషన్ లాగా వెళ్ళిపోయింది. ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా చెప్పి ఉండాల్సింది కానీ మహా చెప్పిన విధానం కరెక్ట్ గా లేకపోవడం వల్ల అనేక విమర్శలు ఎదుర్కొన్నారు. ఇక అదే ప్రోగ్రాం లో పక్కన ఉన్న మిగతా దర్శకులను నందిని రెడ్డి, వివేక్ ఆత్రేయ, మోహన్ కృష్ణ, శివ నిర్వాణ కూడా నవ్వినందుకు విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. నిజానికి వాళ్లు నాతో పని చేశారు కాబట్టి వాళ్ల గురించి నాకు బాగా తెలుసు, వాళ్లకు కూడా మాస్ కమర్షియల్ సినిమాలంటే చాలా ఇష్టం.
కాకపోతే తమ పక్కన ఉన్న సహదర్శకుడు చాలా సరదాగా ఇలాంటి విషయాలు చెబుతున్నప్పుడు వాళ్ళు సహజంగానే నవ్వారు దాన్ని తప్పుగా భావించి వాళ్ళందరినీ ఇలా మాటలతో శిక్షించకూడదు అని అన్నారు. నిజానికి వాళ్లంతా మొహమాటస్తులని 10 నిమిషాల చిన్న వీడియో క్లిప్ చూసి వాళ్ళను జడ్జ్ చేయనని నాని అన్నారు. మనందరం కేజిఎఫ్ 2ని ఇష్టపడతాం, ఆర్ఆర్ఆర్ ను ఇష్టపడతాం మన ఇండస్ట్రీలో రకరకాల సినిమాలు వస్తూ ఉంటాయి. అవి నచ్చితే ప్రమోట్ చేస్తాం నచ్చకపోతే ఇలా కామెంట్ చేస్తాం కానీ మీడియా ముందు ఇలా మాట్లాడడంతో వాళ్ళు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని అన్నారు.
Also Read: Dasara story line Leaked: లవ్ స్టోరీనే కానీ అంతకు మించి.. షాకిస్తున్న లీకైన దసరా స్టోరీలైన్!
Also Read: 'Natu Natu': ఢిల్లీ చాందిని చౌక్ వద్ద నాటు నాటుకి స్టెప్పులేసిన జర్మన్ అంబాసిడర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook