Nani Shyam Singha Roy's Sai Pallavi Pranavalaya Lyrical Song out now : నాని హీరోగా న‌టిస్తోన్న తాజా మూవీ ప్రాజెక్టు శ్యామ్ సింగ‌రాయ్. రాహుల్ సంకీర్త్య‌న్ డైరెక్టర్. ఇటీవల ఈ మూవీ ట్రైల‌ర్‌ రిలీజ్ అయి విశేష ఆదరణ అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ నుంచి సాయిప‌ల్ల‌వి సాంగ్ రిలీజ్ అయ్యింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మూవీలో దేవ‌దాసి పాత్రలో సాయిప‌ల్ల‌వి నటిస్తోంది. ఆమె ప్రేమ‌లో ప‌డ‌తాడు శ్యామ్ సింగరాయ్. (Shyam Singha Roy) ల‌వ్, రొమాంటిక్, యాక్ష‌న్ సీన్లతో ఈ మూవీ ఉండనుంది. వాసు, శ్యామ్ సింగరాయ్ పాత్రల్లో డిఫ‌రెంట్ షేడ్స్‌తో నటించారు నాని. కలకత్తాలో గతంలో ఆచారాల పేరిట జరిగిన దురాచారాల చుట్టూ ఈ మూవీ కథ సాగుతోంది. ఆ దురాచారాన్ని అడ్డుకునే సంస్కర్తగా నాని కనిపించనున్నాడు.



ఇక శ్యామ్ సింగ రాయ్ మూవీ నుంచి సిరివెన్నెల సీతారామశాస్త్రి రాసిన సాంగ్ లిరికల్ వీడియో (Sirivennela Seetharama Sastry Shyam Singha Roy song) రిలీజ్ అయ్యింది. మిక్కీ జె మేయర్ స్వరపరిచిన ఈ పాటని అనురాగ్ కులకర్ణి పాడారు. సాయిపల్లవిపై చిత్రీకరించిన ఈ పాట (Shyam Singha Roy song) ఆకట్టుకుంటోంది. సిరివెన్నెల సీతారామశాస్తి రాసిన ప్రణవాలయ సాంగ్ (Pranavalaya Lyrical Song) ఎంతో అద్భుతంగా ఉంది. సాయి పల్లవి కూడా ఈ పాటకు తగ్గట్లుగా ఎక్సలెంట్‌ ఎక్స్‌ప్రెషన్స్ తో ఆకట్టుకుంది.



Also Read : KL Rahul Vice Captain: సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్ కు వైస్ కెప్టెన్ గా కేఎల్ రాహుల్


ఇక ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి (Sai Pallavi), కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటించారు. వెంకట్ బోయనపల్లి ఈ మూవీ నిర్మించారు. ఈ నెల 24 శ్యామ్ సింగ రాయ్ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో ఈ సినిమా విడుదల కానుంది. మరో వైపు ఈ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో జరుగుతోంది. అందుకు సంబంధించిన లైవ్ ఇక్కడ చూడండి. 




 


Also Read : Close Old Bank Accounts: మీ పాత బ్యాంకు ఖాతాలను వెంటనే క్లోజ్ చేసేయండి.. లేదంటే చాలా నష్టం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook