Nani V movie Vasthunna Vachestunna song: టాలీవుడ్ ( Tollywood ) నేచురల్ స్టార్ నాని ( nani ), సుధీర్ బాబు ( Sudheer Babu ) కాంబినేషన్‌లో వస్తున్న మల్టీ స్టారర్‌ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘వి’ సెప్టెంబరు 5న ఓటీటీ ద్వారా అమెజాన్ ప్రైమ్‌లో (V Movie on OTT) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్‌ను వేగవంతం చేసింది చిత్ర యూనిట్. ఇటీవలనే V సినిమా ట్రైలర్‌ను రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. తాజాగా ఈ సినిమాలోని ‘‘ వస్తున్నా.. వచ్చేస్తున్నా ’’ మెలోడీ పాటను విడుదల చేసింది. ఈ పాటను సుధీర్ బాబు, నివేదా థామస్ మధ్య చిత్రీకరించారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించిన ఈ పాటకు అమిత్ ద్రివేది మ్యూజిక్ అందిచారు. శ్రేయా ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి ఈ పాటను ఆలపించారు. Also read: Degree Exams: ఆ అధికారం రాష్ట్రాలకు లేదు: సుప్రీం


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


నాని 25వ సినిమా (Nani 25th Movie V) వి సినిమాకు మోహ‌న‌కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం వహించారు. శ్రీవెంక‌టేశ్వర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణ సారథ్యం వహిస్తుండగడా.. శిరీష్, ల‌క్ష్మణ్ హ‌ర్షిత్ రెడ్డి నిర్మిస్తున్నారు. నాని, సుధీర్‌భాబు సరసన అదితీరావు హైద‌రీ, నివేదా థామ‌స్ నటించారు. నాని నెగిటివ్ షేడ్ రోల్‌లో కనిపించానున్న ఈ చిత్రం అభిమానులను, ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకుంటుందో చూడాలంటే.. సెప్టెంబరు 5వరకు వేచి చూడాల్సిందే. read: Apsara Rani: స్విమ్ డ్రెస్‌లో రెచ్చిపోయిన అప్సర


Also read: Seerat Kapoor: పిచ్చెక్కిస్తున్న సీరత్ కపూర్ సోయగాలు