Nani 'Shyam Singha Roy' hindi remake:  నేచురల్ స్టార్ నాని, సాయి పల్లవి జంటగా నటించిన 'శ్యామ్ సింగరాయ్' (Shyam Singha Roy) మూవీ డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది.  ఈ సినిమాను త్వరలో హిందీలో రీమేక్ చేయనున్నట్లు వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. 'శ్యామ్ సింగరాయ్' హిందీ రీమేక్ (Shyam Singha Roy hindi remake) హక్కులను ఓ అగ్రనిర్మాణ సంస్థ కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది. హీరో పాత్రలో షాహిద్​ కపూర్ లేదా అజయ్​ దేవగణ్​ పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'శ్యామ్ సింగరాయ్' చిత్రానికి 'టాక్సీవాలా' ఫేమ్​ రాహుల్ సంకృత్యాన్ (Rahul Sankrityan) దర్శకత్వం వహించారు. ఇది 70ల నాటి బెంగాల్ మరియు సమకాలీన హైదరాబాద్ నేపథ్యంలో సాగే టైమ్ ట్రావెల్ కథ. ఈ చిత్రంలో నాని (Hero Nani) డ్యూయల్ రోల్ లో నటించగా..సాయిపల్లవి (Sai Pallavi) దేవదాసి పాత్రలో ప్రేక్షకులను మెప్పించింది. కృతిశెట్టి మరో కీలకపాత్రలో నటించింది. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. నాని ప్రస్తుతం 'అంటే సుందరానికి', 'దసరా' సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. నాని జెర్సీ చిత్రం హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.


Also Read: Isha Koppikar : ఆ హీరో ఒంటరిగా కలవమన్నాడు: నాగార్జున హీరోయిన్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook