Sinnappa dialogue from Narappa movie: నారప్ప సినిమా విడుదల తర్వాత ఒక్క విషయం చెబుతా గుర్తుపెట్టుకో సిన్నప్పా అనే డైలాగ్ ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలిసిందే. నారప్ప సినిమాలో నారప్ప పాత్ర పోషించిన వెంకటేష్ తన చిన్న కొడుకుతో సంభాషించే సమయంలో ఉపయోగించిన ఈ డైలాగ్‌పై సోషల్ మీడియాలో ఇప్పటికే పలు రకాల మీమ్స్ (Narappa memes) వైరల్ అవుతున్నాయి. అలాగే, తాజాగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ వారు (Cyberabad police) కూడా ఇదే డైలాగ్‌ని ఉపయోగించి జనానికి కరోనావైరస్ వ్యాప్తిపై అవగాహన కల్పించేందుకు చేసిన ప్రయత్నం నెటిజెన్స్‌ని విశేషంగా ఆకట్టుకుంటోంది.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also read : రాజ్ కుంద్రా అరెస్ట్: Gehana vasisth photos gallery వైరల్


''ఒక్క విషయం చెబుతా బాగా గుర్తుపెట్టుకో సిన్నప్ప.. కరోనా వైరస్ ఇంకా పోలేదు మాస్క్ పెట్టుకో (Wear mask memes)'' అని సూచిస్తూ సైబరాబాద్ పోలీసులు సరదాగా ఛమత్కారం జోడించి పోస్ట్ చేసిన ట్వీట్ అందరినీ ఆకట్టుకోవడమే కాకుండా కరోనావైరస్ వ్యాప్తి నివారణ కోసం మాస్కు ధరించడం తప్పనిసరి అని చాటి చెబుతోంది. 


ఇలా సమయానికి తగినట్టుగా, నేటి ట్రెండును ఫాలో అవుతూ చమత్కారం జోడించి ట్వీట్స్ చేయడం సైబరాబాద్ పోలీసులకు ఇదేం కొత్త కాదు. గతంలోనూ కరోనావైరస్ వ్యాప్తి నివారణ  (Coronavirus), ట్రాఫిక్ జామ్ నివారణ వంటి సమస్యలపై పోలీసులు చేసిన ట్వీట్స్ వైరల్ అయిన సంగతి తెలిసిందే.


Also read : Raj Kundra pornography case: రాజకీయ నేతలు పోర్న్ చూస్తున్నారు: రాజ్ కుంద్రా పాత ట్వీట్ వైరల్


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook