Naren Vanaparthi Dipali Sharmas Ooriki Uttharana Trailer out now: నరేన్‌ కథానాయకుడిగా సతీష్‌ అండ్‌ టీమ్‌ తెరకెక్కించిన మూవీ ఊరికి ఊత్తరాన (Ooriki Uttharana). వనపర్తి వెంకటయ్య నిర్మాత. దీపాలి శర్మ హీరోయిన్. ఈ మూవీ నవంబర్‌ 19న రిలీజ్ కానుంది. వరంగల్‌లో (Warangal) జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా ఈ మూవీ రూపొందింది. ఇప్పటికే విడుదలైన పాటలు, టీజర్‌కు (Teaser‌) మంచి ఆదరణ దక్కింది. ఇప్పడు ఊరికి ఉత్తరాన (Ooriki Uttharana) మూవీ ట్రైలర్‌ (Trailer) విడుదలైంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

విభిన్న ప్రేమ కథా చిత్రంగా రూపొందింది ఈ సినిమా. 30 ఏళ్లు వయసువచ్చినప్పటికీ పెళ్లికాని అబ్బాయి పాత్రలో హీరో నటించారు. చదువు లేదు.. ఉద్యోగం లేదు.. మరి ఎందుకు వచ్చావు పెళ్లి చూపులకు... ప్రభుత్వ పథకాల్లో (government schemes) ఏ ఒక్కదానికి అర్హత లేదు అంటూ పెళ్లి చూపులకు వెళ్లిన హీరోని పలువురు యువతులు రిజెక్ట్‌ చేస్తుంటారు.



 


Also Read :SBI Card Alert: ఎస్​బీఐ కార్డ్​ యూజర్లకు షాక్​- ఈఎంఐ లావాదేవీలకు ఛార్జీల బాదుడు!


ఈ క్రమంలోనే జీవితంలో ఏదైనా సాధించాలని భావించి చదువుకోవడం కోసం స్కూల్‌లో జాయినైన ఆయన ఎలా ప్రేమలో పడతాడు.. వాళ్ల ప్రేమకు ముగింపు ఏమిటి అనే కథాంశంతో మూవీని (Movie) తెరకెక్కించారు. ఈగల్‌ ఐ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాకి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, సురేష్‌ బొబ్బిలి, ఛాయాగ్రహణం: శ్రీకాంత్‌ అరుపుల.


Also Read :Delhi Lockdown News: ఢిల్లీలో పెరిగిపోతున్న ఎయిర్ పొల్యూషన్.. లాక్ డౌన్ తప్పదా?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook