Naresh and Pavitra Lokesh going to release some more video updates: అనేక వివాదాలు, ప్రచారాలు, ట్రోలింగ్స్ తర్వాత తామిద్దరం వివాహం చేసుకోబోతున్నామని పవిత్ర నరేష్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలో పవిత్ర పేరును ఆమె తండ్రి లోకేష్ పేరుతో కలిపి పవిత్ర లోకేష్ అని పిలిచేవారు. అయితే ఇక మీదట పవిత్ర నరేష్ అని పిలవాలి అంటూ కూడా నరేష్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో విడుదల చేసి తాము త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా ప్రకటించారు. వారు పెళ్లి చేసుకోవడం వారి వ్యక్తిగత విషయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అయితే కొంత వివాదాలు ఏర్పడిన నేపథ్యంలో దాన్ని అధికారికంగా ప్రకటించారు, బాగానే ఉంది. అయితే ఆ ప్రకటించిన స్టైలే బాగోలేదని కొంత మంది విమర్శలు చేస్తున్నారు. నరేష్, పవిత్ర కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకోవడమే కాదు ఒక లిప్ కిస్ కూడా పెట్టుకోవడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. అయితే నరేష్, పవిత్ర ఇక్కడితో ఆగాలి అనుకోవడంలేదని మరింత హాట్ టాపిక్ గా మారే హాట్ వీడియోలు మరిన్ని షేర్ చేయాలని వారిద్దరు యోచిస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.


ఇన్ని రోజులపాటు తాము లీగల్ ఇష్యూస్ వల్ల పెళ్లి చేసుకోవడానికి సమయం పట్టింది, ఆ సమయంలో తమను చాలా మంది ఇబ్బందులకు గురి చేశారు. ఇకమీదట తాము ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని మేము ఏం చేయాలనుకుంటే అది చేస్తాం కాదనడానికి మీరు ఎవరు అని ప్రశ్నించే విధంగా వారు వీడియోలు విడుదల చేసే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మధ్యనే తమను ట్రోల్ చేసే వారి మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడమే కాదు పేరుపేరునా వారందరినీ గుర్తించి మరీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తమను తమ జోలికి వస్తే ఊరుకునేది లేదంటూ వారు హెచ్చరికలు జారీ చేశారు.


ఇప్పుడు మరో అడుగు ముందుకు వేసి తాము జీవించాలని అనుకున్నట్లుగానే జీవించేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి నానక్ రామ్ గూడా నివాసంలో సూపర్ స్టార్ కృష్ణతో పాటు నరేష్ నివసించేవారు. ఆయనతోనే పవిత్ర కూడా సహజీవనం చేస్తూ ఉండేవారు. అయితే కృష్ణ కూడా ఈ మధ్యనే కాలం చేయడంతో ఇక వీరిద్దరూ అక్కడే ఉంటున్నారు అని తెలుస్తోంది. మొత్తం మీద వీరిద్దరూ వివాహం చేసుకోవడం మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పక తప్పదు.


Also Read: NTR 30 Update: నందమూరి ఫాన్స్ కి కొంచెం ఇష్టం కొంచెం కష్టం.. కొరటాల శివ ఏంటి ఇలా చేశాడు?


Also Read: Chiranjeevi : పవన్ ను తిట్టినోళ్లే పెళ్లిళ్లకు, పేరంటాలకు రమ్మని బతిమిలాడతారు.. చిరు కీలక వ్యాఖ్యలు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook