ఈ ఏడాది సూపర్ హిట్ అయిన గీత గోవిందం, మహానటి సినిమాలు రెండూ ప్రమోషన్స్ విషయంలో ఓ కొత్త ఒరవడి అవలంభించాయి. అన్ని సినిమాల తరహాలో విడుదలకు ముందు ట్రైలర్లు విడుదల చేయకుండా నేరుగా సినిమాను విడుదల చేసి బ్రహ్మాండమైన సక్సెస్ అందుకున్నారు ఈ చిత్రాల దర్శకులు, నిర్మాతలు. ఈ నేపథ్యంలోనే ఇవాళ విడుదలైన నర్తనశాల సినిమాను సైతం గీత గోవిందం, మహానటి చిత్రాల మాదిరిగానే ట్రైలర్ విడుదల చేయకుండా విడుదల చేశారు ఈ చిత్ర నిర్మాతలు. గీత గోవిందం తరహాలోనే ఇవాళ నర్తనశాల సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నిన్న కామెడీ ప్రోమో విడుదల చేశారు. మరి గీత గోవిందం, మహానటి చిత్రాల సెంటిమెంట్ 'నర్తనశాల'కు కూడా వర్కౌట్ అవుతుందో లేదో తెలియాలంటే ఇవాళ రిలీజైన ఈ సినిమా ఫలితం ఏంటో తేలే వరకు వేచిచూడాల్సిందే.