Natti Kumar Shock to Rgv: ఎప్పుడూ ఎవరో ఒకరిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో ఉండే రామ్‌గోపాల్‌ వర్మకే తలనొప్పిగా మారారు ప్రముఖ నిర్మాత నట్టి కుమార్. లెస్బియన్ బ్యాక్‌ డ్రాప్‌తో రామ్ గోపాల్ వ‌ర్మ రూపొందించిన చిత్రం ‘డేంజరస్’. తెలుగులో మా ఇష్టం. అయితే ఈ సినిమా విడుదలను అడ్డుకుంటూ నట్టి కుమార్ రెండోసారి కోర్టు మెట్లు ఎక్కి స్టే తెచ్చుకున్నారు. తమకు వర్మ చెల్లించాల్సిన బకాయిలు మొత్తం వసూలు అయ్యేదాకా సినిమా విడుదల కానివ్వబోనని నట్టికుమార్ స్పష్టం చేశారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తెలుగులో మా ఇష్టం, హిందీలో ఖత్రాగా విడుదలకు సిద్ధమవుతున్న డేంజరస్‌ మూవీ రిలీజ్ డేట్ ఏప్రిల్ 8 అని రామ్‌గోపాల్ వర్మ తొలుత ప్రకటించారు. దాంతో నట్టికుమార్ అప్పట్లో కోర్టు నుంచి స్టే తెచ్చుకున్నారు. అయితే స్టే విషయం చెప్పుకోకుండా... థియేటర్లు ఇవ్వలేదన్న కారణంతోనే తాను సినిమాను వాయిదా వేసినట్లు వర్మ ప్రకటించుకున్నారని నట్టి గుర్తు చేశారు. సిటీ సివల్ కోర్టు నుంచి ఈ సినిమాపై తొలిసారి నట్టికుమార్ తెచ్చిన స్టేను వ్యతిరేకిస్తూ వర్మ గతంలో రాష్ట్ర హైకోర్టుకు వెళ్లారు. అయితే ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తొలుత స్టే ఇచ్చిన సిటీ సివిల్ కోర్టులోనే తేల్చేకోమని ఆదేశాలు జారీ చేసింది.


ఇంత జరుగుతున్నా మా ఇష్టం మూవీని మే 6న విడుదల చేస్తామంటూ రెండోసారి రిలీజ్ డేట్‌ను రామ్‌గోపాల్‌వర్మ ప్రకటించిన నేపథ్యంలో మరోసారి నట్టికుమార్ స్టే తెచ్చుకున్నారు. నట్టి కుమార్‌  కొడుకు నట్టి క్రాంతికి ఆర్జీవీ చెల్లించాల్సిన మొత్తం బాకాయిలు చెల్లించే వరకు సినిమాను విడుదల చేయకూడదని కోర్టు ఆదేశించింది. థియేటర్లతో పాటు ఓటీటీ, ఏటీటీ, యూట్యూబ్‌  వంటి ఏ ప్లాట్‌ ఫారంలో విడుదల చేయకుండా ఆదేశాలు జారీ చేసింది.


మరోవైపు తమ్మారెడ్డి భరద్వాజ మీద కూడా నట్టి కుమార్‌ మండిపడ్డారు. ఇటీవల తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు తనకు బాధ కలిగించాయన్నారు. వర్మకు తనకు మధ్య జరిగిన ఒప్పందాలను ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్, ఫెడరేషన్ దృష్టికి తీసుకువెళ్లానన్న నట్టి కుమార్.. అక్కడ పట్టించుకోకపోవడంతోనే కోర్టుకు వెళ్లాల్సి వచ్చిందన్నారు.


Also Read: Fir to file on Hero Suriya Jyothika: హీరో సూర్య, నటి జ్యోతికపై ఎఫ్ఐఆర్‌కు రంగం సిద్ధం


Also Read:  Terrorists Plot For Bomb Blasts: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. తెలంగాణకు ఆయుధాలు


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook