Rajinikanth- Nani: సూపర్ స్టార్ రజినీకాంత్ కొత్త చిత్రంలో నేచురల్ స్టార్ నాని నటించబోతున్నాడట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది. జైభీమ్ ఫేమ్ టీజే జ్ఞాన‌వేల్‌తో ర‌జ‌నీకాంత్ ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. రీసెంట్ గా ఈ సినిమాను అఫీషియల్ గా కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనుంది. అనిరుధ్ సంగీతం అందించబోతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. 2024లో ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ చిత్రంలో నానిది గెస్ట్ రోల్ కాదని.. సినిమాను మలుపు తిప్పే కీలకపాత్రగా తెలుస్తోంది. ఈ సినిమాను కూడా 'జైభీమ్' త‌ర‌హాలోనే సామాజిక స‌మ‌స్య‌ను చ‌ర్చిస్తూ తీయబోతున్నారట జ్ఞాన‌వేల్‌. నాని ఈ సినిమాకు ఓకే చెప్పాడా లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం నాని ‘'హాయ్ నాన్న'’ చిత్రంలో నటిస్తున్నాడు. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో శృతిహాసన్ ఓ కీలకపాత్రలో కనిపించనుంది. ఈ మూవీ ద్వారా శౌర్యవ్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి పోస్టర్స్, గ్లింప్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దసరా సూపర్ హిట్ తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా కావడంతో సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి.


Also Read: Kushi Title Song: 'ఖుషి' నుంచి నయా మెలోడీ.. టైటిల్ సాంగ్ అదిరింది..


మరోపక్క రజినీ ప్రస్తుతం 'జైలర్' సినిమాలో నటిస్తున్నాడు. సూపర్ స్టార్ కు జోడిగా తమన్నా నటిస్తోంది. నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్వ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహ‌న్‌లాల్‌, శివ‌రాజ్‌కుమార్, ర‌మ్య‌కృష్ణ తదితరుల కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. 


Also Read: Bro Full Movie Leaked: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్.. బ్రో ఫుల్ మూవీ HD ప్రింట్ లీక్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu   


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook