Nani 30 Glimpse Released: నేచురల్ స్టార్ నాని, 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. 'నాని 30' అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ రూపొందుతుంది. తాజాగా ఈ చిత్రానికి 'హాయ్ నాన్న' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ ను ఐదు భాషల్లో రిలీజ్ చేశారు.  ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ, కన్నడ, మలయాళ , తమిళ భాషల్లో రిలీజ్ కానుంది.  ఈ చిత్రంలో నాని కుమార్తెగా కియారా ఖన్నా అనే చిన్నారి నటించింది. ఇందులో శ్రుతిహాసన్ ఓ కీలకపాత్ర పోషిస్తుంది. 'దసరా' మూవీ తర్వాత నాని నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి. గతంలో ఫాదర్ సెంటిమెంట్ గా వచ్చిన ఎన్నో చిత్రాలు విజయవంతమయిన సంగతి తెలిసిందే. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

టీజర్ చూస్తుంటే.. తండ్రీ కూతుళ్లు మధ్య సాగే ఎమోషనల్ డ్రామాగా కనిపిస్తోంది.  ఇందులో మృణాల్ ఠాకూర్ నానిని హాయ్ నాన్న అనడం గ్లింప్స్ లో కొసమెరుపు. గతంలో జెర్సీ సినిమాలో నాన్న పాత్ర పోషించి మంచి మార్కులు కొట్టేసిన నాని... ఈ సారి కూడా ప్రేక్షకులను కంటతడి పెట్టించేందుకు రెడీ అయ్యాడు. ఈ సినిమా ద్వారా  శౌర్యవ్ అనే కొత్త డైరక్టర్ ను పరిచయం చేయబోతున్నాడు నేచురల్ స్టార్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ డిసెంబరు 21న పాన్ ఇండియా లెవెల్ లో విడుదలయ్యేందుకు సిద్దమవుతోంది. ఈ మూవీకి హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (సివిఎం), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 



Also Read: Kushi second Single: 'ఖుషి' నుంచి మరో మెలొడీ వచ్చేసింది.. ఆకట్టుకుంటున్న 'ఆరాధ్య' పాట..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి