Naveen Chandra Mother నవీన్ చంద్ర ఇప్పుడు శంకర్ రామ్ చరణ్‌ గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. అసలే ఓటీటీ,వెబ్ సిరీస్‌లో నవీన్ చంద్ర బోల్డ్ పాత్రలు చేస్తూ మెప్పిస్తున్నాడు. యాక్షన్, రొమాంటిక్ సీన్స్‌లో నవీన్ చంద్ర అక్కడి ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇప్పుడు తాజాగా నవీన్ చంద్ర గేమ్ చేంజర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మేరకు ఆయన వేసిన పోస్ట్, షేర్ చేసిన ఫోటో రెండూ వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

నేను చదువుకునే రోజుల్లో నువ్ నా స్కూల్‌కి వస్తే.. నేను సాధించిన వాటిని నీకు చూపించేవాడిని.. అలా చూపించాలని ఎంతో ఎదురుచూసేవాడిని..  బళ్లారిలో నువ్ నాకు చూపించిన జెంటిల్ మెన్ సినిమా నాకు ఇంకా గుర్తుంది.. ప్రభుదేవాను చూపించి.. ఇండియన్ మైఖెల్ జాక్సన్ అని చెప్పడం నాకు ఇంకా గుర్తుంది.. ఇప్పుడు నువ్ ఇలా శంకర్ సర్‌తో మాట్లాడుతూ ఉంటే.. నాకు చిన్న నాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి.


 



గేమ్ చేంజర్ సినిమాలో నాకు చాన్స్ ఇచ్చినందుకు ఆయనకు నీ కృతజ్ఞతలు తెలుపుతున్నావ్.. సెట్‌లో ప్రతీ ఒక్కరూ ఎంతో గొప్పగా నన్ను రిసీవ్ చేసుకుని స్వాగతం తెలిపారు.. నా కోసం, మా అమ్మ కోసం టైం కేటాయించి ముచ్చట్లు పెట్టిన రామ్ చరణ్‌ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాకు ఎంతో మెమొరబుల్‌గా చేసిన చిత్రయూనిట్‌కు థాంక్స్.. నిర్మాణ సంస్థకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ తన తల్లి సెట్స్ మీదున్న ఫోటోలు, శంకర్‌తో మాట్లాడుతున్న ఫోటోలను షేర్ చేశాడు నవీన్ చంద్ర.


Also Read:  Sadha instead of indraja : ఇంద్రజ అవుట్ సదా ఇన్.. కొత్త జడ్జ్‌తో కళకళ


గేమ్ చేంజర్ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి బరిలో దింపాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే శంకర్ ఈ సినిమాను జూలై లేదా ఆగస్ట్‌లో షూటింగ్ పూర్తి చేస్తాడట. ఆ తరువాత రిలీజ్ డేట్ మీద ఫోకస్ పెడతామని దిల్ రాజు చెప్పుకొచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ మూడు విభిన్న గెటప్పుల్లో కనిపించనున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ నటిస్తోంది. ఈ మధ్యే గేమ్ చేంజర్ క్లైమాక్స్‌ను శంకర్ షూట్ చేసిన సంగతి తెలిసిందే.


Also Read:  Mothers Day 2023 : మదర్స్ డే స్పెషల్.. సెలెబ్రిటీల తల్లులు వీళ్లే.. పిక్స్ వైరల్



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook