Miss Shetty Mr Polishetty: ఓటీటీలోకి వచ్చేసిన `మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి`.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Miss Shetty Mr Polishetty Movie: యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందంటే?
Miss Shetty Mr Polishetty OTT Release date: జాతి రత్నాలు ఫేమ్ నవీన్ పోలిశెట్టి, టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క కాంబినేషన్ లో వచ్చిన మూవీ 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి'. మహేశ్ బాబు పచ్చిగొళ్ల దర్శకత్వం వహించిన ఈ మూవీని యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ సంయుక్తంగా నిర్మించారు. ఈ సినిమాకు గోపీ సుందర్, రధన్ సంగీతం అందించారు. సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా షారుఖ్ జవాన్ తో పోటీపడి మరి వసూళ్లు సాధించింది. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ముఖ్యంగా ఓవర్సీస్ లో ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబట్టింది.
లవ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఓటీటీ లవర్స్ ఎదురుచూస్తున్నారు. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‍ఫ్లిక్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మూవీ గురువారం (అక్టోబరు 05) అర్ధరాత్రి 12 గంటల నుంచి నెట్‍ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ మూవీని తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో అందుుబాటులో ఉంచారు. అయితే ఈ మూవీ శాటిలైట్ హక్కులను జీ తెలుగు ఛానెల్ సొంతం చేసుకుంది.
ఈ చిత్రంలో మురళీ శర్మ, అభినవ్ గోమటం, నాజర్, సోనియా దీప్తి, జయసుధ, తులసి తదితరులు కీలకపాత్రలు పోషించారు. స్టాండ్ అప్ కమెడియన్ క్యారెక్టర్ లో నవీన్, 40 ఏళ్లు దాటిన పెళ్లి చేసుకోని చెఫ్ క్యారెక్టర్‌లో అనుష్క నటించారు. ఈ మూవీని థియేటర్లలో మిస్ అయినవారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
Also Read: Chandramukhi 2: ఫిక్స్ అయిన చంద్రముఖి 2 ఓటీటీ వేదిక, ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook