బాల్ థాక్రే పాత్రలో నవాజుద్దీన్ సిద్దిఖీ..!
రమణ్ రాఘవ్, బాబూ మొషాయ్ బందూక్‌బాజ్, బదలాపూర్ లాంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఇప్పుడు ఆయన ఓ అరుదైన పాత్రలో నటించనున్నారు.
రమణ్ రాఘవ్, బాబూ మొషాయ్ బందూక్‌బాజ్, బదలాపూర్ లాంటి సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు పోషించిన బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ. ఇప్పుడు ఆయన ఓ అరుదైన పాత్రలో నటించనున్నారు. శివసేన మాజీ అధ్యక్షుడు బాల్ థాక్రే జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో ఆయన టైటిల్ రోల్ పోషించనున్నారు. డిసెంబరు 21, 2017 తేదిన ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కానుంది.
ఈ చిత్రానికి రాజ్యసభ సభ్యుడు మరియు శివసేన నేత సంజయ్ రౌత్ స్క్రిప్ట్ సహకారం అందిస్తున్నారని వినికిడి. నాలుగు సంవత్సరాలుగా ఆయన ఈ స్క్రిప్ట్ పై పనిచేస్తున్నారు. రిచర్డ్ అటెన్ బర్గ్ తీసిన మహాత్మగాంధీ బయోపిక్ మరియు జస్టిన్ కాడ్విక్ దర్శకత్వం వహించిన మండేలా బయోపిక్ తనకు ఈ చిత్రాన్ని తీయాలన్న స్ఫూర్తిని కలిగించాయని సంజయ్ రౌత్ తెలియజేశారు.