టాలీవుడ్‌లో ఇప్పటి వరకూ ఏ హీరోయిన్ కూడా తీసుకోలేనంత పారితోషికాన్ని ఇప్పుడు ఈ హీరోయిన్ తీసుకోబోతుంది. ఇంతకీ ఎవరా లక్కీ గర్ల్ అని అనుకుంటున్నారా.. ఆమే నయనతార. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న "సైరా" సినిమాకి ఈమె దాదాపు 3 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకోనుంది. అయితే యంగ్ హీరోయిన్ కాకపోయినా నయనతారకు ఇంత పారితోషికం దక్కడం ఆశ్చర్యమే అంటున్నారు పలువురు విమర్శకులు.


తెలుగులో లక్ష్మీ, తులసి, సింహా, శ్రీరామరాజ్యం, జై సింహా చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్న నయనతార దాదాపు చిరంజీవితో తప్ప అందరూ అగ్రహీరోలతోనూ నటించడం గమనార్హం. అదేవిధంగా రానా, రవితేజ, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్ లాంటి యంగ్ హీరోలతో కూడా నటించడం ఈమెకే చెల్లింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినీ పరిశ్రమల్లో కూడా తనదైన శైలిలో దూసుకుపోయిన నయనతార, సైరా చిత్రంలో తెలుగు ప్రేక్షకులను ఎలా కనువిందు చేస్తుందో వేచి చూడాల్సిందే