Nayanthara about casting couch : ఎన్నో రోజుల నుంచి తెలుగు ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ గురించి.. ఎన్నో వినిపిస్తూ వస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్యలో జరిగిన జానీ మాస్టర్ కేస్ తరువాత.. అలానే మలయాళం లో హేమా కమిటీ..తర్వాత మన తెలుగు హీరోయిన్స్ కూడా కొంతమంది మరోసారి క్యాస్టింగ్ కౌచ్ గురించి చెప్పుకోచ్చారు. ఈ క్రమంలో ఒకప్పుడు నయనతార,‌ అనుష్క చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Anushka about casting couch : సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందన్న విషయం అందరికీ తెలిసిందే..ముఖ్యంగా మలయాళం సినీ ఇండస్ట్రీలో ఈ విషయం ఇంకా ఎక్కువగా ఉందని ఇటీవల జస్టిస్ హేమా కమిటీ నివేదిక సమర్పించిన నేపథ్యంలో చాలా ఇండస్ట్రీలు ఉలిక్కిపడ్డాయి.  అంతేకాదు ఇప్పటివరకు ధైర్యంగా బయటకు వచ్చి చెప్పుకోలేని ఎంతోమంది సెలబ్రిటీలు.. జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటకు వచ్చిన తర్వాత ధైర్యంగా చెప్పుకుంటున్నారు. 


ఈ నేపథ్యంలోనే క్యాస్టింగ్ కౌచ్ పై ఒకప్పుడు నోరు విప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు..మన సౌత్ హీరోయిన్స్.  ముఖ్యంగా సౌత్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా చలామణి అవుతున్న నయనతార , అనుష్క శెట్టి, ఐశ్వర్య రాజేష్ తదితర హీరోయిన్లు ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామని ధైర్యంగా మీడియా ముందు చెప్పుకొచ్చారు. మరి ఈ సెలబ్రిటీలు ఎదుర్కొన్న క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ఇప్పుడు చూద్దాం. 



క్యాస్టింగ్ కౌచ్ పై నయనతార..


సౌత్ సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఎక్కువగా ఉందంటూ నయనతార నోరు విప్పి హాట్ బాంబ్ పేల్చింది.  ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో హీరోయిన్ గా అవకాశం ఇవ్వడానికి.. తనను కొంతమంది కొన్ని అడిగారని..  అయితే ఆ ఆఫర్ ను  తాను ధైర్యంగా తిరస్కరించానని చెప్పుకొచ్చింది. “ఒక్కొక్కసారి మనం అవకాశాల కోసం వెనకడుగు వేశామంటే,  ఖచ్చితంగా ఇండస్ట్రీలో నిలబడడం కష్టం. అందుకే ధైర్యంగా ఆ ఆఫర్ ను తిరస్కరించి ముందడుగు వేశాను. అదే నన్ను ఇప్పుడు ఇన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో అగ్రగామిగా నిలబెట్టింది,” అంటూ నయనతార చెప్పుకొచ్చింది.


అనుష్క శెట్టి..


సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ స్పష్టం చేసింది అనుష్క శెట్టి. అంతేకాదు ఇటీవల జస్టిస్ హేమా కమిటీ నివేదిక బయటపెట్టిన తర్వాత టాలీవుడ్ లో కూడా ఇలాంటి కమిటీ ఒకటి వేయాలని.. అనుష్క చెప్పుకొచ్చింది. అనుష్క మాట్లాడుతూ.. “టాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉంది. అయితే ఎప్పుడు నేను దానిని ఎదుర్కోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా సూటిగా నిష్కపటంగా ఉంటాను. ముఖ్యంగా వినోద పరిశ్రమలో ఎక్కువ కాలం కొనసాగాలి అంటే కష్టతరమైన మార్గాలు ఎంచుకోవాలి,” అంటూ తెలిపింది.



వీరితోపాటు ఐశ్వర్య రాజేష్, మంచు లక్ష్మి, పార్వతీ తిరువొతూ  లాంటి తదితర హీరోయిన్లు కూడా సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉంది అంటూ నోరు విప్పి అందరిని ఆశ్చర్యపరిచారు.


Also Read: Haryana: పని చేయని 'హస్తం' అస్త్రాలు.. ఫలితాల వేళ ట్రెండింగ్‌లో జిలేబీ స్వీట్


Also Read: Rahul Gandhi: చెదురుతున్న రాహుల్‌ గాంధీ కల.. తాజా ఫలితాలతో ప్రధానమంత్రి ఆశలు ఆవిరి?



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి