Nayanathara Clarity on Skippiing Promotions is Logicless: లేడీ సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నయనతార ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పటికే పలు సినిమాలు చేసిన ఆమె ఇప్పుడు కనెక్ట్ అనే ఒక హారర్ థ్రిల్లర్ మూవీలో కూడా నటించింది. సినిమాలో వినయ్ రాయ్ భార్య పాత్రలో ఈ సినిమాలో నయనతార కనిపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాకు హారర్ థ్రిల్లర్ స్పెషలిస్ట్ గా పేరు ఉన్న అశ్విన్ శరవణన్ డైరెక్ట్ చేయగా నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మాతగా వ్యవహరించారు. వీరికి చెందిన రౌడీ పిక్చర్స్ బ్యానర్ మీద ఈ సినిమా నిర్మితమైంది. అయితే ఆశ్చర్యకరంగా మునుపెన్నడూ లేని విధంగా నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ లో కనిపించారు. అది కూడా నయనతార ఒక్కరే కనిపించారు.


తెలుగులో సుమతో ఒక ఇంటర్వ్యూ చేయగా తమిళంలో కూడా ఒక ఫేమస్ యాంకర్ తో ఇంటర్వ్యూ చేసి  ఆ రెండు వీడియోలను పీఆర్ టీం ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయించారు. అయితే ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటూ వచ్చే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ కి ఎందుకు హాజరైందా అనే చర్చ జరిగింది. అయితే ఇది సొంత ప్రొడక్షన్ సినిమా కావడంతో సినిమాని ప్రమోట్ చేసుకుంటే నాలుగు రూపాయలు మిగులుతాయనే ఉద్దేశంతోనే ఆమె ప్రమోషన్స్ కు వచ్చిందని ఒక వాదన తెర మీదకు వచ్చింది.


కానీ ఆ విషయం మీద నయనతార కౌంటర్ వేసే విధంగా మాట్లాడింది. తాను ప్రమోషన్స్ కి హాజరు కాకపోవడానికి గల కారణం వేరే ఉందని తాను ప్రమోషన్స్ కి హాజరైతే తనను పెద్దగా పట్టించుకోరని తనకు ప్రాముఖ్యత ఇవ్వరని ఆమె కామెంట్ చేసింది. అయితే బడా స్టార్ హీరోల సినిమాలు సంగతి పక్కన పెడదాం. నిజంగానే స్టార్ హీరోలు వచ్చినప్పుడు వారికి ప్రాధాన్యత ఇచ్చి నయనతారను పక్కన పెట్టారు అనుకుందాం, కానీ ఇప్పుడు నయనతార ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలే కదా చేస్తూ వచ్చింది. అయినా ఆమె ఎందుకు ప్రమోషన్స్ కు హాజరు కావడం లేదు? అసలు హాజరే కాకుండా తనను పక్కన పెట్టారు అనడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఎవరు చెప్పలేని పరిస్థితి.


మరి ఈ విషయం వెనుక ఉన్న లాజిక్ నయనతార అయినా ఆలోచించిందో లేదో తెలియదు కానీ ఈ విషయం మీద నెటిజన్లైతే పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టార్ హీరోల సినిమాలు అయినా స్టార్ హీరో తర్వాత స్టార్ హీరోయిన్ కే కదా ప్రాధాన్యత ఇస్తారు. దర్శకుడు కంటే కూడా ఎక్కువగా హీరోయిన్లకే ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాంటిది తనను ప్రమోషన్స్ లో ప్రాధాన్యత ఇవ్వడం లేదని నయనతార అనడం ఎంతవరకు కరెక్టో ఆమె ఆలోచించుకోవాలి అంటూ కొందరు కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.


Also Read: Venu Swamy on Samantha : సమంత ఆరోగ్యంపై వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు.. 2025 నుంచి దారుణంగా?


Also Read: Venuswamy Comments: టాలీవుడ్లో కలకలం.. హీరో-హీరోయిన్ అకాల మరణం చెందే అవకాశం.. హాట్ టాపిక్ గా వేణుస్వామి కామెంట్స్!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.