Nayanathara and Dhanush:  ఈ మధ్య నయనతార, ధనుష్ మధ్య జరిగిన కాంట్రవర్సి ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే. ఇటీవల, నయనతార ఓ ఓపెన్ లెటర్ ద్వారా ధనుష్ పై తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. నయనతార తన నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ Nayanthara: Beyond The Fairytale కోసం..నానుమ్ రౌడీ ధన్..సినిమా BTS ఫుటేజ్ ఉపయోగించుకుంది.. అయితే అందుకోసం ధనుష్ టీమ్..ఆమె నుండి డబ్బు అడిగారని ఆరోపించింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇక నయనతార వ్యాఖ్యలపై ధనుష్ న్యాయవాది కూడా స్పందించారు. అయితే, ఈ చర్చలు ఇంకా కొనసాగుతున్న సమయంలో.. ఇద్దరు ప్రముఖులు ఒక వివాహ వేడుకలో ఒకే వేదికపై కూర్చోవలసిన.. సందర్భం చోటు చేసుకుంది.


ఇటీవల చెన్నైలో జరిగిన నిర్మాత ఆకాశ్ బస్కరన్ పెళ్లి వేడుకకు నయనతార, ధనుష్ పాల్గొన్నారు. ఈ ఇద్దరూ ముందరి వరసలో కూర్చొని.. ఒకరికొకరు చూసుకోకుండా అటు ఇటు తిరిగి కూర్చున్నారు. ఈ పెళ్లి వేడుకలో రెండు సూపర్ స్టార్‌లు.. ఒకే వేదికపై కన్పించడం ఆసక్తి కలిగించింది.


నయనతార, ధనుష్ మధ్య దారుణమైన వివాదం జరిగిన తర్వాత వారి ఈ సమావేశం మరింత ఆసక్తి రేకెత్తించింది. సాధారణంగా ఇద్దరు సెలబ్రిటీస్ ఒక పెళ్లిలో కలిస్తే.. తప్పకుండా పక్కపక్కన కూర్చొని మాట్లాడుకుంటారు. అయితే వీళ్లు మాత్రం అటూ ఇటూ తిరుగుకొని.. కనీసం ఒకరి వైపు మరొకరు చూడను కూడా లేదు. ఇక దీంతో వీరిద్దరి మధ్య వివాదం ఎంతవరకు చేరింది అని.. సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. 


నయనతార అభిమానులు ధనుష్ అలా.. ఒక 10 సెకండ్ల సీన్ కోసం 10 కోట్లు అడగటం సరికాదు అని వాదిస్తున్నారు. మరోపక్క ధనుష్ అభిమానులు.. నయనతార అలా ధనుష్ కి ముందుగా చెప్పకుండా.. తాను నిర్మాణం వహించిన సినిమా నుంచి సీన్ వాడుకోవడం తప్పని వాదిస్తున్నారు. మొత్తానికి ఈ ఇరువురి అభిమానుల మధ్య పెద్ద ఎత్తున చర్చ మాత్రం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ నయనతార, ధనుష్ ఫోటో తెగ వైరల్ అవుతూ వీరి మధ్య వైరంపై మరింత ఆసక్తి నెలకొల్పింది..


 



Read more: Gautam Adani: బిలియనీర్‌ గౌతమ్‌ అదానీకి బిగ్‌ షాక్‌.. అమెరికాలో అరెస్ట్‌ వారెంట్‌ జారీ.. ఎందుకో తెలుసా?



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.