Nayanatara wedding video streaming date out: తెలుగు.. తమిళంలో నయనతారకి ఉంది క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టార్ హీరోలకి ఉన్నంతమంది అభిమానులు.. నయనతారకు సైతం ఉన్నారు. ఎన్నో ఆఫర్లు వస్తున్న సమయంలోనే నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ పెళ్లి చేసుకొని అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకప్పుడు అయితే.. హీరో హీరోయిన్ల పెళ్లి వీడియోలు అన్ని టీవీలో ప్రత్యక్షమయ్యేవి. కానీ ఇప్పుడు అది మారిపోయింది. ఎందుకంటే ఎంతోమంది హీరోయిన్స్ స్టమ పెళ్లి వీడియోస్ ని.. డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫార్మ్స్ కి ఎంతో డబ్బుకు అమ్ముతున్నారు. అయితే నయనతార కూడా అప్పట్లో తన పెళ్లి వీడియోని.. ఇలానే నెట్ఫ్ ఫ్లిక్స్ కి అమ్మింది అని వార్తలు వినిపించాయి. 


కానీ ఆమె పెళ్లయ్యి రెండు సంవత్సరాలు కావస్తున్న ఇంకా.. అది స్ట్రీమింగ్ కి మాత్రం నోచుకోలేదు. ఈ క్రమంలో నయనతార అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది.గత రెండేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న ఈ నయనతార పెళ్లి డాక్యుమెంటరీ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుంది


వచ్చేనెల నవంబర్లో..దీపావళి కానుకగా.. నెట్ ఫ్లిక్స్ లో నయనతార పెళ్లి వీడియో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది. ఇక ఈ పెళ్లి వీడియో రన్ టైం విషయానికి వస్తే 1 గంట 21 నిమిషాల పాటు ఉంటుంది అని వినికిరి. దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. కాగా నయనతార, డైరెక్టర్ విగ్నేష్ శివన్ చాలా రోజులపాటు డేటింగ్ చేశాక.. 2022లో పెళ్లి బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. వీరిద్దరూ 2015లో విడుదలైన 'నాను రౌడీ ధాన్' సినిమా ద్వారా కలుసుకున్నారు. ఆ తర్వాత వీరిద్దరి మధ్య ఉన్న స్నేహం కాస్తా ప్రేమకి దారి తీసింది. 


దాదాపు ఆరు సంవత్సరాల పాటు ప్రేమించుకున్న ఈ జంట.. 2021లో అతి కొద్దిమంది కుటుంబ సభ్యుల సమక్షంలో.. నిశ్చితార్థం జరుపుకొని.. ఆ తరువాత 2022లో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక అదే సంవత్సరం అక్టోబర్ లో సరోగసి ద్వారా ఇద్దరు మగ పిల్లలకు తల్లిదండ్రులు అయ్యారు.


ఇదీ చదవండి: Pawan Kalyan Second Daughter: పవన్ కళ్యాణ్ చిన్న కూతురును చూశారా.. ఎంత క్యూట్ గా ఉందో..!


ఇదీ చదవండి: Devara Villain Saif: దేవర విలన్ బైరాకు వైయస్ఆర్ ఫ్యామిలీకి ఉన్న ఈ రిలేషన్ తెలుసా..


 



 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter