Nayanthara Surrogacy :  సెలెబ్రిటీలు సరోగసిని ఎక్కువగా ఆశ్రయిస్తుంటారు. హీరోయిన్లు తమ అందచెందాలను కాపాడుకునేందుకు, పురిటినొప్పుల బాధలను తప్పించుకునేందుకు ఇలా రకరకాల కారణాలతో సరోగసిని ఆశ్రయిస్తుంటారు. ఈ అద్దెగర్భం అనేది విదేశాల్లో కామన్. కానీ మన దేశంలో మాత్రం చట్టరిత్యానేరమే అవుతుంది. ఏదైనా తప్పని పరిస్థితుల్లో మాత్రమే సరోగసిని ఆశ్రయించాలని చట్టాలు చెబుతున్నాయి. అయితే వాటిని ఎవ్వరూ అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రస్తుతం నయనతార సరోగసి ద్వారా పిల్లల్ని కనేసింది. దీంతో సరోగసి విధానం ద్వారా పిల్లల్ని కన్న సెలెబ్రిటీల లిస్ట్ మరోసారి చక్కర్లుకొడుతోంది. తెలుగు సెలెబ్రిటీల్లో సరోగసి అనగానే.. అందరికీ మంచు లక్ష్మీ గుర్తుకు వస్తుంది. మంచు లక్ష్మీ సరోగసి ద్వారి విద్యా నిర్వాణకు జన్మనిచ్చిన విషయం అందరికీ తెలిసిందే.


ఇక బాలీవుడ్ సెలెబ్రిటీల్లో అయితే చాలా మంది సరోగసి ద్వారానే పిల్లల్ని కన్నారు. ఇందులో భాగంగా.. శిల్పా శెట్టి, ప్రీతి జింటా, షారుఖ్ ఖాన్ భార్య, ప్రియాంక చోప్రా ఇలా చాలా మంది సరోగసి ద్వారా పిల్లల్ని కన్నారు. సన్నీ లియోన్, కరణ్ జోహర్ భార్య, ఏక్తా కపూర్ ఇలా చాలా మంది సరోగసినే నమ్ముకున్నారు. పిల్లల్ని కన్నారు.


మొత్తానికి ఈ సరోగసి మ్యాటర్ మాత్రం ఇప్పుడు వైరల్ అవుతోంది. నయన్ విఘ్నేశ్ జంటకు జూన్ 9న వివాహాం జరగ్గా.. కనీసం నాలుగు నెలలు తిరక్కుండానే పిల్లల్ని కనడంతో అందరూ ఆశ్చర్యపోతోన్నారు. అంటే పెళ్లికి ముందే.. వీరు సరోగసిని ఆశ్రయించినట్టు కనిపిస్తోంది.


Also Read : Nayanthara twin boys: కవల పిల్లలకు తల్లితండ్రులైన నయనతార-విగ్నేష్ శివన్.. పెళ్లైన నాలుగు నెలలకే!


Also Read: Chiranjeevi Old Video Viral: గరికపాటిది తప్పయితే మెగాస్టార్ ది కూడా తప్పేగా.. చిరు పాత వీడియో వైరల్!


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook