Nayanthara and Vignesh Shivan Invites Tamil Nadu CM MK Stalin to their wedding: కోలీవుడ్ లవ్ బర్డ్స్ న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌లు ఏడేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఈ ఇద్దరు కలిసే ఉంటున్నారు. ఇప్పటికే నయన్, శివ‌న్‌ల వివాహం జరిగినట్టుగా సోషల్ మీడియాలో ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. రహస్యంగా వివాహం చేసుకున్నారని కూడా నెట్టింట న్యూస్ చక్కర్లు కొట్టింది. అయితే లాంటిదేమీ లేదని, త్వరలోనే తాము వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాం అని కోలీవుడ్ ప్రేమ జంట చెప్పకనే చెప్పింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఏడేళ్ల నుంచి డేటింగ్‌లో ఉన్న న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌.. జూన్ 9న పెళ్లి చేసుకోనున్నారని తెలుస్తోంది. ఇందుకు కారణం లేకపోలేదు.. తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్‌ను శుక్రవారం సాయంత్రం కలిసిన ఈ ప్రేమ జంట తమ వివాహ శుభలేఖను అందించారు. స్టాలిన్ త‌న‌యుడు ఉద‌య‌నిధి స్టాలిన్‌ను కూడా పెళ్ళికి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం, ఉద‌య‌నిధి వీరిని అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబందించిన ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. 


కుటుంబసభ్యుల సమక్షంలో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌ నిశ్చితార్థం గతేడాది జరిగింది. పలు కారణాల వలన వాయిదా పడుతున్న వీరి పెళ్లి.. తమిళనాడులోని మహాబలిపురంలోని మహబ్‌ హోటల్‌లో జూన్‌ 9న ఈ పెళ్లి జరగనుంది. హిందూ సంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో వీరి వివాహం గ్రాండ్‌గా జ‌రుగ‌నుంది. కోలివుడ్ వ‌ర్గాల నుంచి అందుతున్న స‌మాచారం ప్ర‌కారం.. జూన్ 8 సాయంత్రం భారీ ఎత్తున రిసెప్ష‌న్ కూడా ఉండ‌బోతుంద‌ని తెలుస్తోంది.


కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో న‌య‌న‌తార‌, విఘ్నేష్ శివ‌న్‌ వివాహం చేసుకోబోతున్నారట. సినిమా రంగానికి చెందిన అతి కొద్దిమంది మాత్రమే ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. క‌మ‌ల్‌ హాస‌న్‌, ర‌జినీకాంత్, అజిత్, విజ‌య్, సూర్యల‌తో సహా ప‌లువురు సినీ ప్ర‌ముఖులు కూడా వీరి పెళ్ళికి హాజ‌రుకానున్న‌ట్లు స‌మాచారం. మరోవైపు టాలీవుడ్ నుంచి కూడా పులువురు స్టార్లు హాజ‌రుకానున్నార‌ట‌. న‌య‌న‌తార‌తో నటించిన హీరోలు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. 


Also Read: Chintamaneni Prabhaker: టీడీపీ నేత చింతమనేని హత్యకు షూటర్? ప్లాన్ చేసింది ఎవరంటే..?  


Also Read: Covid 19 Cases Updates: దేశంలో మళ్లీ పెరిగిన కోవిడ్ కేసుల సంఖ్య.. కొత్తగా ఎన్ని కేసులు నమోదయ్యాయంటే... 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook